క్రికెట్ కు 'కింగ్ కలిస్‌' గుడ్ బై

30 Jul, 2014 18:25 IST|Sakshi
క్రికెట్ కు 'కింగ్ కలిస్‌' గుడ్ బై

దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ జాక్విస్ కలిస్‌ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో 'కింగ్'గా కీర్తించబడిన 38 ఏళ్ల ఈ సఫారీ క్రికెటర్ 2013 డిసెంబర్ లో టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకున్నాడు.

అయితే టీ20లో సిడ్నీ థండర్స్, కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడాలన్న ఆకాంక్షను 'కింగ్ కల్లిస్' వెలిబుచ్చాడు. కల్లిస్ రిటైర్మెంట్ ను దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లార్గట్ స్వాగతించారు. ప్రపంచ క్రికెట్ గొప్ప ప్రతిభాశాలిగా పేరు తెచ్చుకున్న కల్లిస్కు దక్షిణాఫ్రికా దీవెనలుంటాయని పేర్కొన్నారు.

ఇక కల్లిస్ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే...328 వన్డేలు ఆడి 11579 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 86 అర్థ సెంచరీలున్నాయి. 166 టెస్టులాడి 13289 పరుగులు చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 58 అర్థ సెంరీలున్నాయి. బౌలింగ్ లోనూ కల్లిస్ సత్తా చాటాడు. వన్డేల్లో 273, టెస్టుల్లో 292 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు