మలింగకు ఘనంగా వీడ్కోలు

27 Jul, 2019 04:56 IST|Sakshi

తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై శ్రీలంక భారీ విజయం

సెంచరీ బాదిన కుశాల్‌ పెరీరా

కొలంబో: యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగ వీడ్కోలు వన్డేలో శ్రీలంక ఘన విజయం సాధించింది. తద్వారా తమ వెటరన్‌ పేసర్‌కు మంచి బహుమతి ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో లంక 91 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుశాల్‌ పెరీరా (99 బంతుల్లో 111; 17 ఫోర్లు, సిక్స్‌) సెంచరీకి తోడు, కుశాల్‌ మెండిస్‌ (49 బంతుల్లో 43; 4 ఫోర్లు), ఆల్‌ రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ (52 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.

భారీ స్కోరు ఛేదనలో బంగ్లాను మలింగ (3/38) వరుస యార్కర్లతో కంగారుపెట్టాడు. ఓపెనర్లు, కెప్టెన్‌ తమిమ్‌ ఇక్బాల్‌ (0), సౌమ్య సర్కార్‌ (15)లను అతడు ఈ విధంగానే బౌల్డ్‌ చేశాడు. మొదట్లోనే కష్టాల్లో పడిన జట్టును ముష్ఫికర్‌ రహీమ్‌ (86 బంతుల్లో 67; 5 ఫోర్లు), షబ్బీర్‌ రెహ్మాన్‌ (56 బంతుల్లో 60; 7 ఫోర్లు)లు ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు వెనుదిరిగాక బంగ్లా పోరాటం ఎంతోసేపు సాగలేదు. తన చివరి ఓవర్లో ముస్తఫిజుర్‌ (18)ను ఔట్‌ చేసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించి మ్యాచ్‌తో పాటు వన్డేలకు   మలింగ సగర్వంగా బై బై చెప్పాడు.

మలింగ వన్డే కెరీర్‌ 
226 వన్డేల్లో 338 వికెట్లు
బౌలింగ్‌ సగటు 28.87
అత్యధిక వికెట్ల జాబితాలో 9వ స్థానం
అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 6/38

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింధు ఔట్‌ సెమీస్‌లో ప్రణీత్‌

ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్‌

ఆఖరి వన్డేలోనూ అదుర్స్‌

టైటాన్స్‌ది అదే కథ.. అదే వ్యథ

యూపీ యోధ మరోసారి చిత్తుచిత్తుగా..

ఐర్లాండ్‌ ఇంత దారుణమా?

ధోని స్థానాన్ని భర్తీ చేయగలను.. కానీ

నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..

ధోని ఆర్మీ ట్రైనింగ్‌.. గంభీర్‌ కామెంట్‌

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

మహ్మద్‌ ఆమిర్‌ సంచలన నిర్ణయం

మరో ప్రాణం తీసిన బాక్సిం‍గ్‌ రింగ్‌

కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి..

మళ్లీ యామగుచి చేతిలోనే..

అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!

మళ్లీ బ్యాట్‌ పట్టిన యువరాజ్‌ సింగ్‌

సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర

ఇక టాప్‌-5 జట్లకు అవకాశం!

‘ఆమ్రపాలి’ గ్రూప్‌ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!

రాణించిన లీచ్, రాయ్‌

మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి

అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

ధోని.. సైన్యంలో చేరిపోయాడు

క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

సింగమలింగై

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

ఒప్పొందం నుంచి తప్పుకుంది

తలైవాస్‌ చేజేతులా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...