ట్రాఫిక్‌ ఉల్లం‘ఘనుల’ ఆటలు చెల్లవిక

27 Jul, 2019 05:00 IST|Sakshi

లోక్‌సభలో ఆమోదం పొందిన మోటారు వాహనాల సవరణ బిల్లు  

రాజ్యసభ ఆమోదం తర్వాత చట్ట రూపం 

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే పది రెట్ల జరిమానా 

లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు

సాక్షి, అమరావతి: ఇక లైసెన్సులు లేకుండా వాహనం నడిపినా, అతివేగంతో, మద్యం తాగి డ్రైవ్‌ చేసినా భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే! ఈ మేరకు మోటారు వాహనాల సవరణ బిల్లు–2019లో కేంద్రం నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం తర్వాత చట్ట రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులతో కలిసి రవాణా అధికారులు ట్రాఫిక్‌ నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులపై ఓ నివేదిక రూపొందించనున్నారు. బిల్లులో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు జరిమానా పది రెట్లు వరకు పెంచడంతో ఆ మేరకు వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. ఉల్లంఘనులకు పునశ్చరణ తరగతులను నిర్వహించి, కమ్యూనిటీ సర్వీసు చేసేలా కౌన్సెలింగ్‌ చేయనుంది.

ఏటా 9 వేల మంది మృతి 
రాష్ట్రంలో మొత్తం 90 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణా శాఖ సర్వేలోనే తేలింది. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 9 వేల మంది వరకు మరణిస్తుండగా 30 వేల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సాయం చేసిన వారి వివరాలను ఆస్పత్రులు అడుగుతున్నాయి. మరోవైపు పోలీసులు సాక్ష్యం కోసం ఇబ్బందులు పెడుతున్నారు. నూతన బిల్లు ప్రకారం.. ఆస్పత్రులు క్షతగాత్రులను చేర్చే వారి వివరాలను అడగకూడదు. పోలీసులు ఇబ్బందులకు గురి చేయకూడదు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగితే.. ఆ రోడ్డు నిర్మాణంలో లోపముంటే కాంట్రాక్టర్‌ నుంచి అపరాధ రుసుం వసూలు చేయొచ్చు.  


రోడ్డు భద్రతా చర్యలకు రూ.50 కోట్లు 
గుర్తు తెలియని వాహనాలు ఢీకొని వ్యక్తులు మరణించిన సందర్భాల్లో ఆ వాహనాల సమాచారం దొరకదు. దీంతో బీమా క్లెయిమ్‌ చేసేందుకు కుదరడం లేదు. ఈ తరహా కేసుల్లో బాధితులు పరిహారం కోసం కలెక్టర్లకు దరఖాస్తు చేసుకునే వీలు కొత్త బిల్లులో కల్పించారు. దీని ప్రకారం.. రూ.2 లక్షల వరకు బాధితులకు పరిహారం అందుతుంది. వాహనాల థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రకారం.. ప్రమాద మృతులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు అందేలా బిల్లులో పొందుపరిచారు. క్యాబ్‌ల నిర్వాహకుల్ని కూడా చట్టం పరిధిలోకి తెచ్చేలా బిల్లు రూపొందించారు. ఏపీలో క్యాబ్‌ నిర్వాహకులు ఇష్టారీతిన చార్జీలు వసూలు చేస్తుండటంతో ఛార్జీలను నియంత్రించేలా రాష్ట్ర రవాణా శాఖ నిబంధనలు రూపొందించనుంది. రహదారి భద్రత చర్యలకు గత టీడీపీ ప్రభుత్వం రూ.10 కోట్లే కేటాయించి చేతులు దులుపుకోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.50 కోట్లను కేటాయించింది. స్పీడ్‌ గన్‌లు, బ్రీత్‌ ఎనలైజర్లు, ఎన్‌ఫోర్సుమెంట్‌ పరికరాలు కొనుగోలు చేయడానికి రవాణా శాఖకు అవకాశం లభించింది.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లోకాయుక్త సవరణ బిల్లుకు ఆమోదం

పారదర్శకతకు అసలైన అర్థం

దేశానికి దశా దిశా చూపించే బిల్లు

కార్యాచరణ సిద్ధం చేయండి

విద్యా సంస్థల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లు

గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

అవినీతికి ఫుల్‌స్టాప్‌

చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

అమ్మవారిని దర్శించుకున్న ఇళయరాజా..

తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు..

అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు : సీపీ

అమెరికా వెళ్లనున్న చంద్రబాబు

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌’

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

ఆ నిర్ణయంతో మంచి ఫలితం: వైవీ సుబ్బారెడ్డి

ఆ మాట చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్‌ జగన్‌

అందుకే జ్యుడిషియల్‌ బిల్లు : అంబటి 

‘శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు’

ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసం

‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’

స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన

జీతాల కోసం రోడ్డెక్కిన కేశినేని ట్రావెల్స్‌ కార్మికులు

రైతులకు గిట్టుబాటు ధరల కోసమే ఈ బిల్లు

అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటి కల సాకారం

ఈ బిల్లు సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...