టీ20 ప్రపంచకప్ విజేత శ్రీలంక

6 Apr, 2014 22:30 IST|Sakshi
టీ20 ప్రపంచకప్ విజేత శ్రీలంక

మిర్పూర్: టీ20 ప్రపంచకప్-2014ను శ్రీలంక చేజిక్కించుకుంది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో భారత్ను 6 వికెట్ల తేడాతో ఓడించి లంక టీ20 చాంపియన్గా అవతరించింది. భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో 13 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.

కుమార సంగక్కర అజేయ అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 52 పరుగులు చేశాడు. మహేల జయవర్థనే 24, పెరీరా 23, దిల్షాన్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రైనా, మొహిత్ శర్మ, అశ్విన్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత సంగక్కర, జయవర్థనేను సహచరులు తమ భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. వీరిద్దరూ టీ20ల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు