లేజర్‌ రేడియల్‌లో శ్రీను జోరు

7 Jul, 2019 14:04 IST|Sakshi
క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌(ఇన్‌సెట్‌లో)

 రెండు రేసుల్లో అగ్రస్థానం

 హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌

సాక్షి, హైదరాబాద్‌:హుస్సేన్‌సాగర్‌ జలాల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ చాంపియన్‌షిప్‌లో శనివారం ఈఎంఈఎస్‌ఏ సెయిలర్‌ ఎ.శ్రీను ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. లేజర్‌ రేడియల్‌ విభాగాల్లో ఆర్మీ యాటింగ్‌ నోడ్‌ (ఏవైఎన్‌) సెయిలర్లను వెనక్కి నెట్టి 11, 12 రేసుల్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. పదో రేసులో జితేశ్‌ (ఏవైఎన్‌) విజేతగా నిలిచాడు. లేజర్‌ స్టాండర్డ్‌లోనూ ఈఎంఈఎస్‌ఏ సెయిలర్‌ దిలీప్‌ కుమార్‌ 11 రేసులో తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. మిగతా రెండు రేసుల్ని ఏవైఎన్‌ సెయిలర్లు జితేశ్, ఇస్రాజ్‌ అలీ సొంతం చేసుకున్నారు.

లేజర్‌ 4.7 ఈవెంట్‌లో జరిగిన మూడు రేసుల్లో వరుసగా సిఖాన్షు సింగ్‌ (టీఎస్‌సీ), ఆశిష్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), దుర్గాప్రసాద్‌ (ఎన్‌బీఎస్‌సీ) విజేతలుగా నిలిచారు. 470 క్లాస్‌ విభాగాన్ని పీపీ ముత్తు–ఎస్‌సీ సింఘా జోడీ హస్తగతం చేసుకుంది. మూడు రేసుల్లోనే ఈ జోడీనే అగ్రస్థానంలో నిలిచింది. ఆర్‌ఎస్‌:ఎక్స్‌ ఈవెంట్‌లో మన్‌ప్రీత్‌ సింగ్, ఇబాద్‌ అలీ తొలి రెండు రేసుల్ని నెగ్గగా... డేనీ కోయిలో (ఈఎంఈఎస్‌ఏ) చివరి రేసులో విజయాన్ని అందుకున్నాడు. ఫిన్‌ విభాగంలోని మూడు రేసుల్లో వరుసగా జస్వీర్‌ సింగ్, స్వతంత్ర సింగ్, వివేక్‌లు తొలిస్థానంలో నిలిచారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు