చాందిని డబుల్‌

7 Jul, 2019 14:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి చాందిని శ్రీనివాసన్‌  సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచింది. జలంధర్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–14 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో చాందిని 6–0, 6–1తో ప్రాణ్య (ఢిల్లీ)పై గెలుపొందింది. సెమీస్‌లో 6–0, 6–2తో సహీరా సింగ్‌ (హరియాణా)పై,  క్వార్టర్స్‌లో 6–1, 6–1తో ఐశ్వర్య (మహారాష్ట్ర)పై గెలిచింది. డబుల్స్‌లో ప్రతిష్ట సైనీ (పంజాబ్‌)తో జతకట్టిన చాందిని ఫైనల్లో 6–2, 6–3తో ఇనాయత్‌ రాయ్‌–ప్రాణ్యలను ఓడించి చాంపియన్‌లుగా నిలిచారు. సెమీస్‌లో చాందిని–ప్రతిష్ట  ద్వయం 6–2, 6–2తో సీరత్‌ (పంజాబ్‌)–షగుణ్‌  (ఉత్తరప్రదేశ్‌) జోడీపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు