సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జయభేరి

25 Nov, 2013 00:12 IST|Sakshi

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో బాలికల లీగ్ పోటీల్లో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి జట్లు విజయాలను సాధించాయి.
 
 బేగంపేట్‌లోని హెచ్‌పీఎస్ బాస్కెట్‌బాల్ కోర్టులో ఆదివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జట్టు 30-22 పాయింట్ల తేడాతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) జట్టుపై విజయం సాధించింది. ప్రథమార్ధభాగం ముగిసే సమయానికి సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజి జట్టు 16-12తో స్పల్ప ఆధిక్యాన్ని సాధించింది. సెయింట్ ఆన్స్ జట్టులో నిఖిత 18, శారద 10 పాయింట్లు చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు.
 
  హెచ్‌పీఎస్ జట్టులో రష్మిత 13, రమ్య 5 పాయింట్లు చేశారు. ఇతర లీగ్ మ్యాచ్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి 26-25తో సెయింట్ ఆన్స్ స్కూల్‌పై గెలిచింది. చిరెక్ పబ్లిక్ స్కూల్ 32-24తో హోలీ ప్యామిలీ స్కూల్‌పై, సెయింట్ పాయిస్ స్కూల్ 41-29తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై గెలిచాయి. బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ 34-29తో డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై, సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ 32-16తో ఫ్యూచర్స్ కిడ్స్ స్కూల్ పై నెగ్గాయి.
 

మరిన్ని వార్తలు