-

'అతనొక గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌'

28 Nov, 2017 12:21 IST|Sakshi

బ్రిస్బేన్‌:యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ ప్రశంసలు కురిపించాడు.   ఈ ఆధునిక శకంలో స్మిత్‌ ఒక గ్రేట్‌ బ్యాట్స్‌మన​ అని కొనియాడాడు. తన కెరీర్‌ను ముగించే నాటికి స్మిత్‌ ఎన్నో మైలురాళ్లను చేరుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఈ సందర్బంగా యాషెస్‌లో స్మిత్‌ నమోదు చేసిన కెరీర్‌ 21వ టెస్టు సెంచరీని పాంటింగ్‌ ఉదహరించాడు.

' 57  గేమ్‌ల్లో 21 సెంచరీలు చేయడం సాధారణ విషయం కాదు. యాషెస్‌లో సెంచరీ చేయడం అతనికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అన‍్ని వాతావరణ పరిస్థితిల్లోనూ స్మిత్‌ దూకుడు ఆకట్టుకుంటుంది. ఇదే ఫామ్‌ను  స్మిత్‌ కొనసాగిస్తే మాత్రం అతనొక దిగ్గజ ఆటగాడిగా నిలుస్తాడు. ఆల్‌ టైమ్‌ క్రికెట్‌ గ్రేట్‌లైన సచిన్‌ టెండూల్కర్‌, కల్లిస్‌లతో పోలిస్తే పరుగుల పరంగా స్మిత్‌ ముందున్నాడనే  చెప్పాలి. సచిన్‌ పదిహేను వేల పరుగులు, కల్లిస్‌ పదమూడు వేల పరుగులు చేయడానికి వారు 150పైగా టెస్టుల ఆడారు. స్మిత్‌ 50 మ్యాచ్‌లు ఆడేటప‍్పటికే ఐదువేలకు పైగా పరుగులు చేశాడు. అతని కెరీర్‌ ముగిసే నాటికే మరిన్ని ఘనతలు అతని సొంతం కావడం ఖాయం' అని పాంటింగ్‌ అభిప‍్రాయపడ్డాడు.

 

మరిన్ని వార్తలు