‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’

23 Feb, 2020 12:20 IST|Sakshi

తన మనసులో మాట బయటపెట్టన సురేష్‌ రైనా

క్రికెట్‌-సినిమా ఈ రెండు రంగాల మధ్య రిలేషన్‌షిప్‌, మంచి బాండింగ్‌ ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది టీమిండియా క్రికెటర్లు సినిమా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించారు. కొన్ని ప్రేమ జంటలు పెళ్లి పీటలు ఎక్కగా మరికొన్ని జంటలు ప్రేమికులుగానే విడిపోయారు. పటౌడీ, అజహరుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీ వంటి క్రికెటర్లు కూడా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించినట్టు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇక విరాట్‌ కోహ్లి, హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌లు బాలీవుడ్‌ హీరోయిన్లతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా బాలీవుడ్ నటి నటాశాతో నిఖా ఫిక్స్‌ చేసుకోగా.. కేఎల్‌ రాహుల్‌ ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తనకు కూడా సెలబ్రెటీ క్రష్‌ ఉందని టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ సురేష్‌ రైనా తాజాగా తెలిపాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రేపై తనకున్న ప్రేమ‌ని వివ‌రించాడు రైనా. కాలేజీ రోజుల నుంచి సోనాలితో డేటింగ్‌కు వెళ్లాలనే ఆశ ఉండేదని తెలిపాడు. అయితే తన కోరిక నెరవేరలేదన్నాడు. కానీ.. ఓ రోజు సోనాలి నుంచి స్పెషల్‌ మెసేజ్‌ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. అమె ఎప్పటికీ తనతో పాటు ఎంతో మందికి కలల రాకుమారేనని అన్నాడు. ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధితో పోరాడి గెలిచిన సమయంలో ఆమె యువ తరానికి ఓ రోల్‌ మాడల్‌గా నిలిచారని రైనా పేర్కొన్నాడు. ఇక గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న రైనా రానున్న ఐపీఎల్‌లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలిన ఉవ్విళ్లూరుతున్నాడు.  

చదవండి:
పాక్‌ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు!
మాకు కోహ్లి కావాలి: బంగ్లాదేశ్‌
‘జడేజానే నా ఫేవరెట్‌ ప్లేయర్‌’

మరిన్ని వార్తలు