ధోనీసేన క్లీన్ స్వీప్

15 Jun, 2016 18:01 IST|Sakshi
ధోనీసేన క్లీన్ స్వీప్

హరారే: జింబాబ్వే పర్యటనలో టీమిండియా ముచ్చటగా మూడోసారి మెరిశారు. మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలోనూ ధోనీసేన ఆల్రౌండ్ షోతో రాణించి 10 వికెట్లతో అలవోకగా విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో భారీ తేడాతో గెలుపొందిన భారత్.. తాజా విజయంతో పరిపూర్ణం చేసింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా కేవలం 21.5 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (63), ఫజల్ (55) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును సునాయాసంగా గెలిపించారు. జింబాబ్వే బౌలర్లు ఎంత శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. టీమిండియా బౌలర్లు చెలరేగడంత 42.2 ఓవర్లలో 123 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణించి నాలుగు వికెట్ల పడగొట్టాడు. చహల్ రెండు, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. జింబాబ్వే జట్టులో అత్యధికంగా సిబండా 38 పరుగులు చేశాడు. సిబండాతో పాటు చిబాబా 27, మరుమా 17, మడ్జివా 10 (నాటౌట్) పరుగులు చేయగా, ఇతర ఆటగాళ్ల స్కోరు సింగిల్ డిజిట్కే పరిమితమైంది. జింబాబ్వే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుంది.

మరిన్ని వార్తలు