తెలంగాణ జట్లకు మూడో స్థానం

12 Dec, 2017 10:38 IST|Sakshi

ఫెడరేషన్‌ కప్‌ ఖో–ఖో టోర్నీ   

సాక్షి, హైదరాబాద్‌: ఫెడరేషన్‌ కప్‌ జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్లు రాణించాయి. సరూర్‌నగర్‌ ఖో–ఖో స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మహిళల, పురుషుల విభాగాల్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. మహిళల టైటిల్‌పోరులో మహారాష్ట్ర 15–6తో కర్ణాటకపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విదర్భపై తెలంగాణ గెలుపొందింది. పురుషుల ఫైనల్లో మహారాష్ట్ర 22–5తో కొల్హాపూర్‌పై విజయం సాధించింది.

ఈ కేటగిరీలో తెలంగాణ మూడోస్థానంలో, కేరళ నాలుగో స్థానంలో నిలిచాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో ‘శాట్స్‌’ ఎండీ ఎ. దినకర్‌ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత ఖో–ఖో సమాఖ్య కార్యదర్శి మహేందర్‌ సింగ్‌ త్యాగి, తెలంగాణ ఖో–ఖో సంఘం కార్యదర్శి వై. శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా ఖో–ఖో సంఘం కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు