చాంపియన్‌ వెంకట్‌ అనికేత్‌

3 Dec, 2019 10:01 IST|Sakshi

గోల్డ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: గోల్డ్‌స్లామ్‌ జూనియర్, పురుషుల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వెంకట్‌ అనికేత్‌ విజేతగా నిలిచాడు. మెట్టుగూడలోని షఫిల్‌ టెన్నిస్‌ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అనికేత్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో అనికేత్‌ 8–6తో ఆనంద్‌పై గెలుపొందాడు. అండర్‌–16 బాలుర ఫైనల్లో జి. రఘునందన్‌ 6–3తో మొహమ్మద్‌ ఇర్షద్‌ను ఓడించాడు. అండర్‌–14 కేటగిరీలో ఇషాన్‌ సయ్యద్‌ మొహమ్మద్, తనిష్క యాదవ్‌ టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు.

బాలుర సింగిల్స్‌ ఫైనల్లో ఇషాన్‌ 6–4తో అభిరామ రెడ్డిపై గెలుపొందగా, తనిష్క 6–1తో దీక్షితను ఓడించింది. అండర్‌–12 బాలుర ఫైనల్లో శ్రీహిత్‌ 6–4తో సంకీర్త్‌పై, బాలికల విభాగంలో హాసిని 6–2తో శ్రీవల్లిపై గెలుపొందారు. అండర్‌–10 బాలికల టైటిల్‌పోరులో శ్రీయుక్త 6–1తో శ్రీయ గుప్తాపై నెగ్గింది. అండర్‌–8 విభాగంలో తనవ్‌ వర్మ 6–2తో గీతన్‌ రెడ్డిపై గెలిచి చాంపియన్‌గా నిలిచాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'సిద్దూ ఆడకపోవడంతోనే నాకు చాన్స్‌ వచ్చింది'

డక్‌వర్త్‌  ‘లూయిస్‌’ కన్నుమూత

‘మతం వద్దు.. మానవత్వమే ముద్దు’

రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ..

రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌

సినిమా

తెలంగాణలో మరో 27 కరోనా కేసులు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా

బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్‌..

ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..