వార్నర్ డబుల్ సెంచరీ మిస్

4 Mar, 2015 15:06 IST|Sakshi

వన్డే ప్రపంచ కప్లో భాగంగా  బుధవారం అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 133 బంతుల్లో 178 పరుగులు చేసిన వార్నర్.. షపూర్ బౌలింగ్ లో క్యాచ్ అవుటయ్యాడు. డబుల్ సెంచరీ పూర్తయితే ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వార్నర్ రికార్డు సృష్టించేవాడు.  40 ఓవర్లలో ఆసీస్ 299/2 స్కోరు చేసింది.

 

>
మరిన్ని వార్తలు