అప్పట్లో మమ్మల్ని ఊడ్చేశారు.. ఇప్పుడలా కాదు: కెప్టెన్

15 Nov, 2017 14:36 IST|Sakshi

లండన్ : తాను తొలిసారి 2013-14 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై పర్యటించినప్పుడు తమ జట్టు 5-0తో ఘోర వైఫల్యం చెందిందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. మిచెల్ జాన్సన్ 37 వికెట్లతో చెలరేగడంతో అప్పుడు వైట్ వాష్ అయ్యాం. ఆ సిరీస్ నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నాని రూట్ తెలిపాడు.

యాషెస్ సిరీస్ నేపథ్యంలో రూట్ మాట్లాడుతూ.. 'ఆ సిరీస్ చివరి టెస్ట్ సిడ్నీలో నన్ను జట్టు నుంచి తప్పించారు. కాగా, ఈ సీజన్లో కెప్టెన్‌గా మళ్లీ ఆసీస్ గడ్డలో ఆడబోతున్నాను. గత సిరీస్ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఆసీస్ బౌలర్ జాన్సన్ టెస్టుల నుంచి రిటైరయ్యాడు. అతడి బౌలింగ్ నాయకత్వాన్ని మిచెల్ స్టార్క్ తీసుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. పోరాటం చేసి సత్ఫలితాలు సాధించేందుకు కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారని' చెప్పాడు.

మరిన్ని వార్తలు