విండీస్‌ క్లీన్‌స్వీప్‌ 

14 Jan, 2020 02:44 IST|Sakshi

మూడో వన్డేలో ఐర్లాండ్‌పై 5 వికెట్లతో గెలుపు

గ్రెనడా: ఛేదనలో వెస్టిండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ స్ఫూర్తిదాయక (97 బంతుల్లో 102; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)సెంచరీకి చివర్లో నికోలస్‌ పూరన్‌ (44 బంతుల్లో 43; 5 ఫోర్లు, సిక్స్‌) ఫినిషింగ్‌ తోడవ్వడంతో... ఐర్లాండ్‌తో ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 49.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఆండీ బాల్‌బిర్నీ (93 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

హెడెన్‌ వాల్‌‡్ష జూనియర్‌ 4 వికెట్లతో రాణించగా... థామస్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం వర్షం రావడంతో విండీస్‌ విజయ లక్ష్యాన్ని 47 ఓవర్లకు 197 పరుగులుగా అంపైర్లు కుదించారు. విండీస్‌ 36.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలుపొందింది. లూయిస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులను అందుకున్నాడు. మరోవైపు ఐర్లాండ్‌తో బుధవారం మొదలయ్యే టి20 సిరీస్‌లో పాల్గొనే వెస్టిండీస్‌ జట్టులో డ్వేన్‌ బ్రేవో పునరాగమనం చేశాడు. మూడేళ్ల తర్వాత అతను టి20 జట్టులోకి రావడం విశేషం. బ్రేవో సభ్యుడిగా ఉన్న విండీస్‌ జట్టు 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు సాధించింది.

మరిన్ని వార్తలు