ఇంగ్లండ్ ఆటతీరుపై ఇయాన్ బోథమ్ ఆగ్రహం!

3 Sep, 2014 15:53 IST|Sakshi
ఇంగ్లండ్ ఆటతీరుపై ఇయాన్ బోథమ్ ఆగ్రహం!
లండన్: ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన వన్డేల్లో ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటతీరు ఓ జోక్ తలపించిందని ఆదేశ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన తీరు ఆగ్రహం తెప్పించిందని ఆయన అన్నారు.  ప్రపంచ కప్ కు ఆరునెలల ముందు ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉందని బోథమ్ మండిపడ్డారు. 
 
ఇలా దారుణమైన ఆటను ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ కు బదులు 'ఎగ్ కప్' గెలుచుకుంటే అదృష్టమే అని వ్యాఖ్యలు చేశారు. పరాజయాల నుంచి ఇంగ్లాండ్ గుణపాఠం నేర్చుకోవడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చేసిన తప్పులే మళ్లీ.. మళ్లీ చేస్తుండటం తనను నిరాశకు గురిచేస్తోందని బోథమ్ అన్నారు. 
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు