యువరాజ్‌ సింగ్‌కు గాయం

9 May, 2017 10:53 IST|Sakshi
యువరాజ్‌ సింగ్‌కు గాయం

హైదరాబాద్‌: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ గాయపడ్డాడు. ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా యువీ చేతి వేలికి గాయమైంది. రోహిత్‌ శర్మ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అతడు గాయపడ్డాడు. వెంటనే అతడు మైదానాన్ని వీడాడు. యువీకి జట్టు ఫిజియో చికిత్స చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగి 9 పరుగులు చేశాడు. అయితే గాయం పెద్దది కాదని, మిగతా మ్యాచుల్లో అతడు ఆడే అవకాశముందని తెలుస్తోంది.

34 ఏళ్ల యువీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి 234 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆదరగొట్టాడు. 41 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. అయితే తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి నిన్న ప్రకటించిన భారత జట్టులో యువరాజ్‌ సింగ్‌ చోటు సంపాదించాడు.

మరిన్ని వార్తలు