అంతర్జాతీయ కనెక్టివిటీకి విజయవాడ-ఢిల్లీ విమానం

29 Mar, 2016 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ: విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు నాంధి పడనుంది. దీనిలో భాగంగా ఎయిర్ ఇండియా ముందుగా విజయవాడ నుంచి ఢిల్లీకి ఏప్రిల్ 15 నుంచి  ప్రత్యేకంగా విమాన సర్వీసు నడపనుంది. విజయవాడ  ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా ప్రకటించిన అనంతరం ఇదే విమానాన్ని విదేశాలకు నడిపేయోచనలో ఉన్నట్టు ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 15 నుంచి సాయంత్రం 6.50కి ఢిల్లీలో బయలుదేరే ఈ విమానం రాత్రి 9.10కి విజయవాడ చేరుకుంటుంది.

విజయవాడలో రాత్రి 9.55కి బయలుదేరి అర్ధరాత్రి 12.05కు ఢిల్లీ చేరుంటుంది. అమెరికాలోని చికాగో, జేఎఫ్‌కే. శాన్‌ఫ్రాన్సిస్కోతోపాటు వివిధ దేశాలకు ఢిల్లీ నుంచి తెల్లవారుజామున విమానాలు బయలుదేరుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఈ షెడ్యూలును ఖరారు చేశారు. అలాగే విదేశాల నుంచి దాదాపు అన్ని విమానాలు సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో ఢిల్లీ చేరుకుంటాయి. అందువల్ల ఢిల్లీ నుంచి విజయవాడకు సాయంత్రం 6.50కి నడిపేలా షెడ్యూలు ఖరారుచేశారు.

మరిన్ని వార్తలు