రాజేశ్వరి కుడికాలికి 7 గంటల శస్త్రచికిత్స

20 Nov, 2019 20:28 IST|Sakshi

సాక్షి, చెన్నై : అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా అనురాధ రాజేశ్వరి అనే మహిళ కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎడమ కాలు మోకాలు కింది భాగం మొత్తాన్ని తొలగించగా, రాజేశ్వరి కుడికాలికి మంగళవారం వైద్యులు ఏడు గంటల సేపు శస్త్రచికిత్స చేశారు. కాగా కోయంబత్తూరు సింగానల్లూరుకు చెందిన నాగనాధన్‌ కుమార్తె రాజేశ్వరి గత 11వ తేదీన పీలమేడు ప్రాంతంలో మొపెడ్‌లో వెళుతుండగా అన్నాడీఎంకే జెండా స్తంభం కూలడంతో అదే సమయంలో వస్తున్న లారీ కిందపడి గాయపడింది.

ఆమెను నీలాంబూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్సలందించారు. అక్కడ ఎడమకాలికి ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడటంతో ఆ కాలును మోకాలి వరకు తొలగించారు. ఇలావుండగా రాజేశ్వరి కుడి కాలులో శస్త్రచికిత్స చేసి రాడ్స్‌ అమర్చేందుకు వైద్యులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన శస్త్రచికిత్స నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు 7 గంటలపాటు సాగింది. ఎడమకాలి గాయం పూర్తిగా నయమైన తర్వాత ఆమెకు కృత్రిమ కాలును ఏర్పాటుచేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు