ఇసైకి ముహూర్తం కుదిరింది

26 Jan, 2015 04:30 IST|Sakshi
ఇసైకి ముహూర్తం కుదిరింది

 ఇసై చిత్రానికి ముహుర్తం కుదిరింది. దర్శక నటుడు ఎస్‌జె సూర్య హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇసై. ఇది ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ మధ్య ఇగో ఇత్యాది అంశంతో కూడిన కథా చిత్రమంటూ ప్రచారం జరిగి కలకలం పుట్టించిన చిత్రం. ఈ చిత్రంలో ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ప్రకాష్‌రాజ్ నిరాకరించి చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం.
 
 మొత్తం మీద చాలా కాలంగా నిర్మాణంలో వున్న ఇసై చిత్రానికి ఇప్పటికీ మోక్షం వచ్చింది. ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఇసై చిత్రం ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందంటున్నారు. చిత్ర దర్శక హీరో ఎస్‌జె సూర్య, ప్రకాష్‌రాజ్ తిరస్కరించిన పాత్రను సత్యరాజ్ పోషించడం విశేషం. కథా నటి సావిత్రి నాయకిగా పరిచ యం అవుతున్న ఈ చిత్రానికి ఎస్‌జె సూర్య నే సంగీత బాధ్యతలు చేపట్టడం మరో విశేషం. ఇసై చిత్రాన్ని ఈ నెల 30న 300థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా