చిందులకు చెక్‌

18 Jul, 2018 10:00 IST|Sakshi

 లైవ్‌బ్యాండ్‌ నృత్యాలపై నియంత్రణ

అక్రమంగా నిర్వహిస్తే చర్యలే

పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌కుమార్‌  

బనశంకరి: బెంగళూరులో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు, లైవ్‌ మ్యూజిక్‌ షోలు నిర్వహిస్తున్న హోటల్స్, రెస్టారెంట్లకు నోటీసులు ఇస్తాం, అనధికార లైవ్‌బ్యాండ్, నైట్‌ క్లబ్‌లకు అడ్డుకట్ట వేస్తాం అని నగర పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలోమీడియా సమావేశంలో సునీల్‌కుమార్‌ మాట్లాడారు. నగరంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్‌లతో కలిపి సుమారు 400 సంస్థలకు నోటీసులు జారీచేశామని తెలిపారు. లైవ్‌బ్యాండ్‌ నిర్వహించే సంస్థలు అందుకు అనుమతి పత్రాలు, బీబీఎంపీ నుంచి స్వాధీనపత్రాలతో పాటు ముఖ్య రికార్డులను అందజేయాలన్నారు. వాటిని పరిశీలించి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లైసెన్సులు జారీ చేస్తామని తెలిపారు. లైసెన్సు లేని రెస్టారెంట్లలో లైవ్‌ బ్యాండ్లను నిలిపివేస్తామని ప్రకటించారు.

విదేశీయులకు అద్దెకిస్తున్నారా?
విదేశీ పర్యాటకులు బెంగళూరుకు వచ్చినప్పుడు వారికి ఇంటిని బాడుగకు ఇచ్చేవారు పాస్‌పోర్ట్స్, వీసా అవధి పరిశీలించాలి, వాటి జిరాక్స్‌ కాపీలను తీసుకుని అద్దె అగ్రిమెంట్‌ పత్రంతో కలిపి సమీప పోలీస్‌స్టేషన్‌లో అందజేసి సమాచారం అందించాలని కమిషనర్‌ చెప్పారు. దొంగలుగా మారిన కొలంబియా పర్యాటకులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని ఇలాంటి నియమాలు పాటించలేదు, వారితో పాటు నిందితులు అక్రమంగా ప్రీపెయిడ్‌ సిమ్‌ విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఇక ముందు విదేశీయుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు.

గీతాకృష్ణ కేసులో నిఘా పెట్టాం
గీతా విష్ణు డ్రగ్స్‌ విచారణ దిశలో  ఉందని, అతడిపై పోలీసులు నిఘా వహించామని సీపీ తెలిపారు. అతడు పోలీసులకు దొరికినప్పుడు చికిత్సకోసం ఆసుపత్రిలో చేరి, వెనుక ద్వారం నుంచి తప్పించుకోవడానికి అవకాశం కల్పించారని సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక కోసం వేచిచూస్తున్నామని, అందిన వెంటనే చార్జ్‌షీట్‌ వేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు