నాగ్, కార్తీ, తమన్నా... యూరప్ టూర్

2 Jul, 2015 13:37 IST|Sakshi
నాగ్, కార్తీ, తమన్నా... యూరప్ టూర్

చెన్నై: ప్రముఖ నటులు నాగార్జున, కార్తీ జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు విదేశాలలో చిత్రీకరించనున్నారు. అందుకోసం నాగార్జున, కార్తీ, హీరోయిన్ తమన్నతోపాటు చిత్ర యూనిట్ యూరప్ వెళ్లనుంది. దాదాపు నెలరోజుల పాటు యూరప్లోని పలు నగరాలలో ఈ చిత్ర షూటింగ్ జరుపుకోనుంది.

ఈ మేరకు ఆ చిత్ర నిర్మిణ సంస్థ పివిపి సినిమా ప్రొడక్షన్ హౌస్ గురువారం చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేసింది. నాగార్జున, కార్తీ, తమన్నల మీద పలు సన్నివేశాలు చిత్రీకరిస్తామని తెలిపింది. అలాగే ప్యారిస్ నగరంలో కారు ఛేజింగ్ సన్నివేశాలపై షూటింగ్ జరుపుకుటుందని పేర్కొంది. ఈ సన్నివేశాలు భారతీయ చలన చిత్రరంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తుందని పివిపి కార్యాలయం వెల్లడించింది. నాగ్, కార్తీ, తమన్నా ముఖ్య తారగణంతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా