మందు బాబులకు షాక్

27 Oct, 2016 09:12 IST|Sakshi
మందు బాబులకు షాక్
మందు బాబులకు ఢిల్లీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కార్లలో పార్టీలు చేసుకుంటూ మద్యం సేవించే యువత ఇకపై బాటిళ్లకు మూత పెట్టక తప్పదు. లేకపోతే డైరెక్ట్ గా జైలుకు వెళ్లాల్సిందే. వచ్చే నెల 7వ తేదీ నుంచి పబ్లిక్ లో మద్యం సేవించే వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున జరిమానా లేదా జరిమానాలతో కూడిన జైలు శిక్షను విధించనుంది.
 
ఇందుకోసం ఎక్సైజ్ శాఖ చట్టాలను కూడా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించేవారికి రూ. 5వేల జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి గొడవ చేస్తే జరిమానాను డబుల్ చేయడంతో పాటు సదరు వ్యక్తికి అబ్కారీ శాఖ చట్టం కింద మూడు నెలల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు చెప్పారు.
 
కార్లలో స్నేహితులతో కలిసి మద్యం సేవించడం(కార్-ఓ-బార్) ఢిల్లీలో మామూలే. ఎక్కువ మంది మందు బాబులు లిక్కర్ షాపుల వద్ద లేదా ఫుడ్ కోర్టుల వద్ద నిలిపివున్న కార్లలో మద్యం సేవిస్తూ ఉంటారు. బార్లలో అధిక రేట్లు తట్టుకోలేని యువత ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. 
మరిన్ని వార్తలు