అడుగడుగునా భయం భయం..!

13 Jul, 2020 10:05 IST|Sakshi
వంతెనపై నుంచి మోటారుబైక్‌ను దాటిస్తున్న దృశ్యం ,భయం భయంతో వంతెన దాటుతున్న ప్రజలు

కర్రల వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తున్న బిందైబొస్తొ గ్రామస్తులు  

శిథిలావస్థకు చేరుకున్న తాత్కాలిక వంతెన

శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్న బాధితులు

ఒడిశా, భువనేశ్వర్‌/పూరీ: పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి సమితి బల్లిఘాట్‌ బిందైబొస్తొ గ్రామస్తుల నిత్య జీవితం ఇలా అడుగడుగునా భయం భయంతో సాగుతోంది. ఏ చిన్నపాటి అవసరం తీర్చుకోవాలన్నా.. ఈ గెడ్డను దాటి, అవతలి ఒడ్డున ఉన్న పూరీ పట్టణం పోవాల్సిందే. ఈ క్రమంలో గెడ్డపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కర్రల వంతెనపైనుంచే ఇక్కడి వారంతా రోజువారీ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇది ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏ క్షణంలో కూలిపోతోందోనని పాదచారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే క్రమంలో వంతెనపై ఉన్న ఏ చిన్న బల్ల కానీ కర్ర కానీ జారినా అక్కడి గెడ్డలో పడిపోవాల్సిందే. ఈ విషయంపై పలుమార్లు అధికారులు, నేతలను కలిసి, శాశ్వత వంతెన ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేదని బాధిత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వంతెన నిర్మాణానికి చొరవ చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు