హోరాహోరీగా సాగుతున్న జాతీయ బాక్సింగ్ పోటీలు

4 Feb, 2014 02:37 IST|Sakshi

బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : విమ్స్ క్రీడామైదానంలో జరిగిన జాతీయ పైకా పోటీల్లో భాగంగా జరిగిన బాక్సింగ్ పోటీల్లో వివిధ  రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. సోమవారం ఉదయం 10.30 ప్రారంభమైన బాక్సింగ్ పోటీలు రాత్రి వరకు కొనసాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సాగిన పోటీల్లో గెలుపొందిందిన వారి వివరాలు.. బాలికల విభాగంలో మణిపూర్‌కు చెందిన జోయ్‌లక్ష్మిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హేమ, జార్ఖండ్‌కు చెందిన గలోమార్‌దిపై ఉత్తరాంచల్‌కు చెందిన దీపికా, మిజోరాంకు చెందిన లాల్‌హైపుటీపై పంజాబ్‌కు చెందిన కరంజీత్ కౌర్, మణిపూర్‌కు చెందిన ప్రేమీదేవిపై కర్ణాటకు చెందిన కౌసియా, పంజాబ్‌కు చెందిన బాదబర్ కౌర్‌పై తమిళనాడుకు చెందిన గాయత్రి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంజనపై హరియానాకు చెందిన సోను, మిజోరాంకు చెందిన లాల్‌రేతీల్ట్‌పై ఉత్తరాంచల్‌కు చెందిన హిమానీపాంత్, కర్ణాటకకు చెందిన భవ్యపై హర్యానాకు చెందిన బిందు, పంజాబ్‌కు చెందిన అమన్‌దీప్‌కౌర్‌పై మణిపూర్‌కు చెందిన తిలోజ్‌మాంచ్,  మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నపై ఉత్తరాంచల్‌కు చెందిన హేమాద్మీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగలక్ష్మిపై తమిళనాడుకు చెందిన ఐశ్వర్య, తమిళనాడుకు చెందిన హేమలతపై మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్న తదితరులు గెలుపాందారు.
 
బాలుర విభాగంలో
 
కర్ణాటకకు చెందిన కార్తీక్‌పై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసాద్, జార్ఖండ్‌కు చెందిన నార్‌పార్త్‌సింగ్‌పై హరియానాకు చెందిన హరీష్ ,మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుష్‌పై హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నికిత్ ,తమిళనాడుకు చెందిన సీఎస్‌ఆర్ రాజ్‌పై ఉత్తరఖాండ్‌కు చెందిన సాంధు, కర్ణాటకకు చెందిన కౌసిక్‌రెడ్డిపై పంజాబ్‌కు చెందిన ప్రమింద్‌సింగ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వీర్‌సింగ్ పై మణిపూర్ చెందిన అటంభమేహిత్, పంజాబ్‌కు చెందిన అజిత్‌పాల్‌పై మణిపూర్‌కు చెందిన ఎం.డి.ఖాన్, మిజోరాంకు చెందిన చంగల్ లింగల్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వరూప్, కర్టాటకకు చెందిన అమర్‌పై ఉత్తరఖాండ్‌కు చెందిన కుమార్, కర్ణాటాకకు చెందిన పవన్‌కుమార్‌పై అంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్.హరికృష్ణ, పంజాబ్‌కు చెందిన జయదీప్‌సింగ్‌పై హరియానాకు చెందిన అంకిత్, మధ్యప్రదేశ్‌కు చెందిన శుభం యాదవ్‌పై మణిపూర్‌కు చెందిన హరిదాస్‌సింగ్, ఉత్తరఖాండ్‌కు చెందిన పవన్‌చంద్‌పై హరియానాకు చెందిన నవీన్‌బూరాలు విజయం సాధించారు. అదేవిధంగా టెబుల్ టెన్నీస్‌లోను హోరాహోరీగా పోటీ కొనసాగింది.
 

మరిన్ని వార్తలు