సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఏడేళ్ల జైలు

11 Mar, 2016 15:50 IST|Sakshi
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఏడేళ్ల జైలు

చెన్నై: భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు మహిళా న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆంధ్రా, చిత్తూరుకు చెందిన పెంచిల నరసింహులు (28) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నరసింహులుకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన స్వరూపతో 2012లో వివాహం జరిగింది. పెళ్లి తరువాత దపంతులు చెన్నైలోని కేకే.నగర్‌లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం నరసింహులు తరచూ స్వరూపను వేధించేవాడు. ఈ విషయమై దంపతులు గొడవపడేవారు.
 
దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక 2013 సెప్టెంబర్ 13న స్వరూప ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై విచారణ జరిపిన అశోక్‌నగర్ పోలీసులు  నరసింహులపై వరకట్న కేసు నమోదు చేశారు. ఈ కేసు మద్రాసు మహిళా న్యాయస్థానంలో న్యాయమూర్తి కలైమది సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది గౌరి అశోకన్ హాజరై కేసుపై విచారణ జరిపారు. నేరం నిర్ధారణ కావడంతో పెంచిల నరసింహులకు ఏడేళ్లు జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

మరిన్ని వార్తలు