ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం..

17 Nov, 2023 19:35 IST|Sakshi

వారంలో 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్‌ కావడం సులభమే అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గత కొంతకాలంలో సోషల్ మీడియాలో 70 గంటల పని గురించి చర్చలు వెల్లువెత్తాయి. అవన్నీ ఇప్పుడు కొంత సద్దుమణిగాయి అనేలోపే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లేదా ఫైనాన్సియల్ అనలిస్ట్ కావడం చాలా తేలిక, కంపెనీ నడపడం.. వ్యాపారవేత్తగా మారడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించారు.

బిజినెస్ చేయడానికి.. వ్యాపారవేత్తలుగా మారటానికి రిస్క్ తీసుకునే యువకులకు బాసటగా నిలిచేలా సమాజంలో మార్పులు రావాలని ఆయన వెల్లడించారు. 1981లో ఇన్ఫోసిస్‌లో కేవలం ఆరుమంది ఇంజినీర్లు మాత్రమే ఉన్నారని, ఆ తరువాత ఊహకందని రీతిలో వినూత్న ఆలోచనలతో పారిశ్రామికవేత్తలు పెరిగారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఖాతాల్లోకి రూ.820 కోట్లు పడగానే ఆనందపడిన జనం - అంతలోనే..

దశాబ్దం క్రితం కంటే నేటి యువత గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సంక్లిష్ట సమస్యలను సైతం పరిష్కరించే ఉత్సాహం వారిలో ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టే యువకులకు అందరూ అండగా ఉండాలని చెబుతూ.. సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీరింగ్‌, ఫైనాన్షియ‌ల్ అనాలిసిస్ వంటి వాటి కంటే వ్యాపార రంగం భిన్నంగా ఉంటుందని, ఇందులో సక్సెస్ వస్తుందా? రాదా అనే గ్యారెంటీ ఉండదని..  మొత్తం రిస్క్‌తో కూడుకున్నపని అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు