మానవ హక్కులపై అవగాహన అవసరం

18 Jan, 2014 06:28 IST|Sakshi

బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ :  రాజ్యాగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత హక్కులు, వాక్ స్వాతంత్య్ర మౌలిక సూత్రాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది, బళ్లారి న్యాయవాదుల సంఘం జిల్లాధ్యక్షుడు పాటిల్ సిద్దారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక బుడా కాంప్లెక్స్‌లోని మానవ హక్కుల జాగృతి కార్యాలయాన్ని ఆ సంఘం రాష్ట్రధ్యక్షులు సమేతనహళ్లి లక్ష్మణసింగ్ ప్రారంభించిన అనంతరం ఆయన మా ట్లాడారు.

భారతదేశంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్, రష్యాలో స్టాలిన్, అమెరికాలో అబ్రహాం లింకన్ తదితరులు రాజ్యాంగంలో వివిధ హక్కులను పొం దుపరిచారన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కులను అందరూ పొందే అవకాశం ఉందన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మరవరాదన్నారు. రాజ్యాంగం ప్రకారం ఖైదీలు, నేరస్తులకు ఇలా ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 అంతకు ముందు మానవ హక్కుల జాగృతి సమితి రాష్ట్ర అధ్యక్షుడు సమేతనహళ్లి లక్ష్మణసింగ్ మాట్లాడుతూ 2011 నవంబర్ 1న రాష్ట్ర మానవ హక్కుల సమితిని వ్యవస్థాపకుడు డాక్టర్ ఆనంద్‌కుమార్, గౌరవాధ్యక్షుడు సుభాష్ భరణి నేతృత్వంలో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రజల్లో మానవ హక్కులపై చైతన్యం కల్పించేం దుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాగృతి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

 అందుకు ప్రభుత్వంతో పాటు సంఘ సంస్థలు ఎప్పటికప్పుడు తమకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మానవహక్కుల జాగృతి సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ.శ్రీనివాస్, పదాధికారులు చాంద్, నాగరాజు గౌళి, కళమళ్లి వెంకటేష్, శంకర్, జిల్లాధ్యక్షులు లోకేష్, కార్యదర్శి శశిధర్, సహకార్యదర్శి ఎస్.శ్యాంప్రసాద్, జంటి కార్యదర్శి కేధర్‌నాథ్, జిల్లా మహిళా అధ్యక్షులు గౌసియా, కొప్పళ సమితి రాజాసాబ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు