జలమయం.. జనజీవనం

22 Jul, 2015 02:25 IST|Sakshi
జలమయం.. జనజీవనం

 సాక్షి, ముంబై : ముంబై, శివారు జిల్లాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోవండిలో గోడ కూలి ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారి తెలిపారు. వర్షం కారణంగా ఉద్యోగులు, కార్మికులకు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. భారీ వర్షం వల్ల రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల ఆలస్యంగా నడిచాయి.

అగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ సహ పలు రైళ్లు రద్దయ్యాయి. గత రాత్రి నుంచి వర్షాలు ఉధృతంగా కురుస్తుండటంతో మంగళవారం పాల్ఘ ర్, థానేలో పాఠశాలలు మూ సివేశారు. కుర్లా, చెంబూర్, తి లక్‌నగర్, అంధేరీ, పరేల్, లోయర్ పరేల్, థానే, నవీముంబై, రాయ్‌గఢ్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా కుర్లా, సియాన్ మార్గంలోని పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు వెస్ట్రన్ రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొద్ది సమయం వరకు నిలిపేశారు. గత 24 గంటల్లో దక్షిణ ముంబైలోని కొలాబాలో 15.8 ఎంఎం వర్షపాతం నమోదైంది. శాంతాకృజ్‌లో 61 ఎంఎం వర్షపా తం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. థానే జిల్లాలో గత ఇరవైనాలుగు గంటల్లో 143 ఎంఎం వర్షపాతం నమోదైంది. థానేలో 85 ఎంఎం వర్షపాతం, కుర్లాలో 195 ఎంఎం, భివండీలో 195 , షహాపూర్‌లో 138, ఉల్లాస్‌నగర్‌లో 150, అంబర్‌నాథ్‌లో 142, ము ర్బాద్‌లో 98.50 ఎంఎం వర్షపాతం నమోదైంది.  

 రైళ్ల రాకపోకలకు అంతరాయం
 భారీ వర్షాలకు సబర్బన్ రైళ్లకు అంతరాయం కలిగింది. పాల్ఘర్‌లో వర్షం కారణంగా ముంబై నుంచి బయలుదేరాల్సిన రైళ్లు రద్దయ్యాయి. బాంద్రాలో సాంకేతిక కారణాల వల్ల పలు లోకల్ రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది. వెస్ట్రన్ రైల్వే రైళ్లు 15-20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీనియర్ వెస్ట్రన్ రైల్వే సీనియర్ పీఆర్‌వో గజనన్ మహాత్‌పుర్కార్ చెప్పారు. అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్, బాంద్రా-సూరత్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, ముంబై సెంట్రల్-పోరుబందర్ ఎక్స్‌ప్రెస్, బాంద్రా టర్మినస్-వాపి ప్యాసెంబర్ రైళ్లు రద్దయ్యాయి.

కుర్లా, సీఎస్‌టీ మధ్య ఉదయం 10.15కు పది నిమిషాలపాటు సబర్బన్ సేవలు నిలిపేశారు. అయితే ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దవలేదు. సబర్బన్ సర్వీసులు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని సెంట్రల్ రైల్వే పీఆర్‌వో ఏకే సింగ్ చెప్పారు. కుర్లా, సియాన్, థానే మార్గాల్లోని రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోయిందని సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ట్రాఫిక్ జామ్ అవడంతో బెస్ట్ బస్సులను దారి మళ్లించినట్లు  బీఎంసీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో ఇరవైనాలుగు గంట ల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మధ్య ముం బై వాతావరణ శాఖ డెరైక్టర్ వీకే రాజీవ్ తెలిపారు.

 పొలం పనులు ప్రారంభం
 నాసిక్ జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 220 మి.మీ. వర్షం కురిసిందని నాసిక్ జిల్లా వాతావరణ శాఖ వెల్లడించింది. మొన్నటి వరకు వర్షాలు లేక బేజారైన రైతులకు సంతోషాన్నిచ్చింది. అనేక తాలూకాల్లో వర్షం కురవడంతో రైతులు పొలం పనులకు ఉపక్రమించారు. అనేక గ్రామాల్లో వరి నాటువేసే పనులు ప్రారంభించారు.
 
 భివండీలో కుండపోత
  భివండీ పట్టణంలో నిరంతరాయంగా కు రుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కామ్‌వారి, వారణ, తాన్సా నదులు నిండి నీరు పొంగి ప్రవహిస్తుండటంతో పక్కనే ఉన్న గణేశ్‌పురీ, వజ్రేశ్వరి, అక్‌లోలి గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు సూ చించారు. కామ్‌వారి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నదినాకా, శేలార్ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. మండాయి, మాడా కాలని, బందర్ మోహల్లా, ఇదిగా రోడ్, సంగమ్‌పాడ, అంబికా నగర్, తీన్‌బ త్తి, నజరానా కాంపౌండ్, కోని, కారివలి దర్గారోడ్ ప్రాం తాల్లో ఆరడుగుల ఎత్తు మేర వరదనీరు ప్రవహిస్తుండటంతో స్థానికులను తరలించడానికి కార్పొరేషన్ బోట్లను ఉపయోగిస్తోంది.
 
 పాల్ఘర్‌లో 445 మి.మీ. వర్షపాతం నమోదు
  పాల్ఘర్ జిల్లాలో 24 గంటల్లో 445 మి.మీ. వర్షాపాతం నమోదైంది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాణ్‌గావ్, సఫాలే రైల్వే స్టేషన్ల సమీపంలో పట్టాలపైకి నీరు చేరి డహాణు నుంచి ముంబై వచ్చే రైళ్లని నిలిపివేశారు. వంతెనలపై నుంచి వాగు నీరు ప్రవహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా పాల్ఘర్ జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సఫాలా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని పాల్ఘర్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

మంగళవారం ఉదయం వరకు పాల్ఘర్‌లో వర్షపాతం 445 ఎంఎం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. పాల్ఘర్-బోయ్‌సర్ రోడ్డుపై ఎస్‌టీ వర్క్‌షాప్, ఉంరోలీ, సరవ్లీ నీరు నిలిచిపోవడంతో రోడ్డు మూసేశారు. థానేలోని భివండీ, కళ్యాన్ టౌన్‌షిప్ ప్రాంతాల్లో వర్షం కారణంగా నీరు నిలిచింది. పాల్ఘర్‌లో వర్షం ఉధృతికి గుజరాత్ మార్గంలోని రైలు పట్టాల కింది భాగం కొట్టుకుపోయిందని, దీంతో గుజరాత్ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగిందన్నారు. వసై-విరార్ కార్పొరేషన్ హద్దులోని చాందీప్ గ్రామంలో 20 మంది గ్రామస్తులు  వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు