సకలకళావల్లభన్ వస్తున్నాడు | Sakshi
Sakshi News home page

సకలకళావల్లభన్ వస్తున్నాడు

Published Wed, Jul 22 2015 2:30 AM

సకలకళావల్లభన్ వస్తున్నాడు

 సకలకళావల్లభన్ అనగానే కమలహాసనే గుర్తుకొస్తారు. అప్పట్లో ఆ చిత్రం ఒక సంచలనం. అదే టైటిల్‌తో ఇప్పుడు నటుడు జయంరవి వస్తున్నారు. ఎస్ ఈయన నటించిన అప్పాటక్కర్ చిత్రం సకలకళావల్లభన్‌గా పేరు మార్చుకుని ఈ నెల 31న విడుదలకు సిద్ధం అవుతోంది. అందాల భామలు త్రిష,అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. సురాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారానే నటి అంజలి కోలీవుడ్‌కు రీఎంట్రీ అయ్యారన్నది గమనార్హం. ఎస్‌ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గీతాలు మంగళవారం మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.
 
  నిర్మాణ కార్యక్రమాలతో పాటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆ నెల 31 విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం వెల్లడించారు. జయంరవి ఇంతకు ముందు నటించిన రోమియోజూలియట్ మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత వస్తున్న  ఈ సకలకళావల్లవన్ చిత్రంపై భారీ అంచనాలే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా చిత్రంలో త్రిష, అంజలి వంటి ఇద్దరు ముద్దగుమ్మలు ఉన్నారు. వారితో జయంరవి రొమాన్స్ సన్నివేశాలు ముమ్మరంగానే ఉంటాయని ఫొటోలను చూస్తే అనిపిస్తోంది. అదేవిధంగా కమలహాసన్ టైటిల్‌తో వస్తోంది. అలాంటిది ఇది ఏపాటి విజయం సాధిస్తున్న ఆసక్తి చిత్రపరిశ్రమలో నెలకొంది.
 

Advertisement
Advertisement