ఈసారి 72 శాతం పోలింగ్ నమోదు

7 Feb, 2015 02:06 IST|Sakshi

అసోచాం అంచనా
 
న్యూఢిల్లీ: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నేడు ఢిల్లీ ఓటరు ఎన్నికల బరిలో నిలచిన అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాడు. గతంలో కంటే ఈసారి ఓటేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచాం) శుక్రవారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ మేరకు నియోజక వర్గానికి 100 మంది చొప్పున  70 నియోజకవర్గాల్లో ఏడు వేల మంది అర్హులైన ఓటర్లతో సర్వే నిర్వహించినట్లు వివరించింది.

ప్రజలు ఈసారి సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించింది. గత ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ‘ఢిల్లీవాలా ఈసారి సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. పోలింగ్‌లో పాల్గొనేందుకు ప్రజలు ఉత్సాహంగా ఎదురృుచూస్తున్నారు.’ అని అసోచాం ప్రధాన కార్యదర్శి జనరల్ డీఎస్ రావత్ తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు