అయ్యో ! పాపం

25 Feb, 2019 11:44 IST|Sakshi
ప్రాణాలు కాపాడుకోలేక కాలిపోయిన కుందేలు

బూడిదవుతున్న అడవులు

అంతరిస్తున్న వృక్ష సంపద, వన్య జీవులు

కన్నడనాట అడవులను కార్చిచ్చు దహించి వేస్తోంది. అరుదైన వన్యజీవులు, వృక్ష సంపద కాలి బూడిదవుతోంది. రెండు రోజులుగా తగలబడుతున్న బండీపుర జాతీయ ఉద్యానవనంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు.  

కర్ణాటక, మైసూరు : కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తరించిన బండీపుర జాతీయ ఉద్యానవనంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పట్లో శాంతించేలా లేదు. గురువారం అంటుకున్న మంటలు రోజురోజుకూ బండీపుర జాతీయ ఉద్యానవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండడంతో వేల ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతంలోని విలువైన వృక్షసంపద, పక్షులు, ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.అటవీప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు, వాలంటీర్ల యువకుల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నా ఎక్కడోఒకచోట మంటలు చెలరేగుతున్నాయి. దీంతో మూడు రాష్ట్రాల అగ్నిమాపక దళం సిబ్బంది, అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు బండీపురలో ప్రజలకు సఫారీ నిషేధించారు. దీంతోపాటు బండీపుర జాతీయ ఉద్యానవనంలోని గోపాలస్వామి బెట్టపైనున్న ప్రాచీన దేవాలయంలోకి కూడా అధికారులు ప్రవేశాన్ని నిషేధించారు. 

మంటల్లో కాలిపోయిన కోతి   

మరిన్ని వార్తలు