ఎన్‌ఐఏ వేధిస్తోంది: భత్కల్

29 Apr, 2014 22:54 IST|Sakshi

న్యూఢిల్లీ: తీహార్ జైల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపక సభ్యుడు యాసిన్ భత్కల్ ప్రత్యేక కోర్టుకి మంగళవారం తెలిపారు. కేంద్ర దర్యాప్త సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని, కనీసం తగిన ఆహారం కూడా ఇవ్వడం లేదని భత్కల్ దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నాడు. కడుపు నొప్పి వచ్చినా వైద్య సదుపాయం కల్పించడం లేదని ఆరోపించాడు. దీన్ని విచారించిన డిస్ట్రిక్ట్ జడ్జి ఐఎస్ మెహతా, తీహర్ జైలు అధికారులు వారంలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. జైలు నిబంధనల ప్రకారం భత్కల్‌కు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తదుపరి విచారణను వచ్చే నెల 29కి వాయిదా వేశారు.
 

మరిన్ని వార్తలు