ప్రజావాణికి 142 వినతులు

30 Sep, 2014 02:56 IST|Sakshi

 ప్రగతినగర్/శివాజీనగర్ : జిల్లా కేంద్రంలో స్థానిక ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 142 వినతులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మధ్యాహ్నం వరకు వినతులు స్వీకరించారు.
 
కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ
జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను నూతన ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆ యన జిల్లాలో జరుగుతున్న బతుకమ్మ పండుగ ఏర్పా ట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
 
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
జిల్లాలోని భవన నిర్మాణ రంగాల కార్మికులను అదుకోవాలని జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండారు గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనకలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో  లక్ష మంది భవన నిర్మాణ రంగాల కార్మికులు ఉన్నారని తెలిపారు. నిరుపేదలైన  కార్మికులకు నివాస స్థలాలతోపాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.  ప్రతి ఒక కుటుంబానికి 30 కిలోల బియ్యం అందించాలన్నారు.

బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్‌తోపాటు మరికొందరు తమ ప్రాంతంలోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని, వారిపై చర్యలు తీపుకోవాలని ఫిర్యాదు చేశారు.దసరా పండుగ సందర్భంగా సివిల్ సప్లయ్ గోదాములో పని చేస్తున్న హమాలీలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా స్వీట్లు, బోనస్‌కు సంబంధించిన చెక్‌ను అందించారు.

మరిన్ని వార్తలు