16లోగా నివేదికలు పంపించాలి

14 Jun, 2014 04:34 IST|Sakshi
16లోగా నివేదికలు పంపించాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నివేదికలను ఈనెల 16వ తేదీ లోగా పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వివిధ  జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన 9 కమిటీల నివేదికలను అత్యంత ప్రాధాన్యమైనవిగా భావించి ఈనెల 16లోగా పంపించాలన్నారు. ఎన్నికల్లో ఎన్‌సీసీవైలేషన్, ఎఫ్‌ఐఆర్‌బుక్ చేసిన వివరాలు, పెయిడ్ న్యూస్ వివరాలు, వీడియో ఫు టేజీ, ఖర్చులు, ఆర్‌టీఐయాక్ట్ వివరాలను విధిగా సమర్పించాలని సూ చించారు.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని కూడా ఈ నెల 16లోగా సంబంధిత ఆర్‌ఓలకు సమర్పించేందుకు గాను అవసమైతే వారికి  ఓరియంటేషన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల నిర్వహణలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నట్లయితే వాటిని డాక్యుమెంటేషన్ చేసి పంపించాలన్నారు.

60 మంది అభ్యర్థులు మాత్రమే వివరాలు సమర్పించారు
 జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 5 ఫార్మాట్ల సమాచారం ఇప్పటికే పంపించామన్నారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించేందుకు వీలుగా ఈనెల 10వ తేదీన ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలి పారు. జిల్లాలో 183 మంది ఎన్నికల్లో పోటీచేయగా అందులో 60 మంది తమ ఎన్నికల వ్యయం వివరాలను సమర్పిం చారన్నారు. జిల్లాలో ఈవీఎంల విని యోగంపై 2,3 దఫాలలో శిక్షణ ఇచ్చామని అందువల్ల  ఎక్కడ కూడా ఈవీఎం సమస్య తలెత్తలేదన్నారు.

కేవ లం నాలుగు చోట్ల మాత్రమే ఈవీఎంలను మార్పు చేసినట్లు చెప్పారు. ఈవీఎంలపై జిల్లా స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో పూర్తి శిక్షణ ఇవ్వడం వల్ల  ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినపుడు స్వతంత్ర అభ్యర్థులకు ఒకేరకమైన గుర్తులు కేటాయించడం వల్ల కొన్ని ఇబ్బందులు జరి గాయని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు పార్లమెంటు, అసెంబ్లీలకు పోటీచేసే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఒకే రకమైన గుర్తులు కేటాయించవద్దని ప్రధాన ఎన్నికల అధికారికి కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు