తిరిగి విధుల్లో చేరిన 45 మంది పోలీసులు

29 Jun, 2020 19:22 IST|Sakshi

కరోనాను జయించి మళ్లీ డ్యూటీలో చేరిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనాపై యుద్ధంలో నగర పోలీసులు చేస్తున్న కృషి చరిత్రలో నిలుస్తుందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. నక్సల్స్ నుంచి కరోనా వరకు అన్ని సమస్యలను పోలీసులు ముందుడి ఎదుర్కొంటున్నారని.. పోలీసు వ్యవస్థ ఎప్పుడూ వైఫల్యం చెందదని వ్యాఖ్యానించారు. ప్రాణాంతక కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న 45 మంది పోలీసులు సోమవారం తిరిగి విధుల్లో చేరారు.(హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌పై ప్రకటన!)

ఈ సందర్భంగా బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువ కేసులు నమోదుకావడానికి సిటీ పోలీసుల కృషి కారణమన్నారు. జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకు ప్రతీ సందర్భంలో వారు ముందుండి నడిచారని పేర్కొన్నారు. కరోనా వీరులకు, వారికి కుటుంబాలకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. వారికి స్వాగతం పలకడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కరోనాను జయించిన తర్వాత తిరిగి మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ.. సానిటైజర్లు వాడాలని సూచించారు.(చదవండి: 100 రోజుల లాక్‌డౌన్‌.. ఏం జరిగింది?)

మరిన్ని వార్తలు