రుణమాఫీ,రీషెడ్యూల్పై కమిటీ నియామకం

19 Jul, 2014 18:05 IST|Sakshi
వి.నాగిరెడ్డి

హైదరాబాద్: రైతుల రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి ఛైర్మన్‌గా ఉంటారు. మరో 11 మంది సభ్యులు ఉంటారు. రెవిన్యూ, ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్యకార్యదర్శులు, రాష్ట్రస్థాయి  బ్యాంకర్స్ కన్వీనర్ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.

రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్‌పై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆ తరువాత ఒక సమగ్ర నివేదికను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తుంది.

మరిన్ని వార్తలు