‘పాన్‌’కు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి..

5 Mar, 2019 10:57 IST|Sakshi

మార్చి 31వరకు గడువు

కుత్బుల్లాపూర్‌: ‘పాన్‌ కార్డు’... నిన్నటి వరకు చాలా మందికి ఒక ఐడెండిటీ కార్డ్‌..అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.. ఒక వ్యక్తి ఎకనామిక్‌ స్టేటస్‌ (ఆర్థిక స్థితి)ని తెలిపే ముఖ్యమైన పర్సనల్‌ అకౌంట్‌ నెంబరు. కోట్లాది జనాభాలో కూడా పాన్‌ కార్డు ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి గతులను ఇట్టే తెలిపే ముఖ్యమైన పత్రం..  ఐటీ రిటరన్స్‌ ధాఖలు చేయాలంటే ఖచ్చితంగా పాన్‌ నెంబరు సదరు వ్యక్తి కలిగి ఉండాల్సిందే. లేని పక్షంలో ఐటీ రిటరŠన్స్‌ ధాఖలు చేయలేము. ఇక  అంతే ప్రాముఖ్యత ఉన్న మరొక ముఖ్యమైన పత్రం ఆధార్‌. ప్రతి సంక్షేమ పథకానికి, బ్యాంక్‌ అకౌంట్‌ ప్రారంభానికి, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇప్పుడు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ముఖ్యంగా స్థిరాస్తుల కొనుగోళ్లల్లో ఆధార్‌ ఖచ్చితం చేయడంతో సదరు వ్యక్తి స్థిరాస్తుల లావాదేవీల వివరాలు రికార్డై ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐటీ రిటరŠన్స్‌ ధాఖలు చేసే వ్యక్తులు లెక్కల్లో కొన్ని కొన్ని వివరాలను తప్పిస్తు పన్నులు తక్కువగా కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ఇప్పుడు ఐటీ రిటరన్స్‌ ధాఖలు చేసే ప్రతి వ్యక్తి  వారి వారి పాన్‌ కార్డులకు ఆధార్‌ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంది. ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 139ఏఏ ను అనుసరించి ఆధార్‌ను పాన్‌ కార్డుకు తప్పకుండా లింక్‌ చేయాల్సిందే. దేశంలో ఇప్పటి వరకు 42 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా వాటిలో ఇప్పటి వరకు 23 కోట్ల పాన్‌ కార్డులను ఆధార్‌కు అనుసంధానం చేశారు. మిగిలిన వారు ఇంకా చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు 31 మార్చి 2019 తో ముగియనున్నది. ఒక వేళ ఐటీ రిటరŠన్స్‌ దాఖలు చేసే వారు పాన్‌ కార్డులను ఆధార్‌కు లింక్‌ చేయకపోతే గడువు దాటిన తరువాత సదరు వ్యక్తుల పాన్‌కార్డు నెంబర్లు డిలీట్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో పాన్‌ కార్డును ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్టుమెంట్‌ వెబ్‌సెట్‌ ద్వారా లేదా ఎస్‌ఎంఎస్‌ రిక్వెస్ట్‌ ద్వారా పాన్‌ కార్డును లింక్‌ చేసుకోవచ్చు. అసలు సులువుగా పాన్‌ కార్డును ఆధార్‌కు లింక్‌ చేసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

వెబ్‌ సైట్‌ ద్వారా..
ముందుగా ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్టుమెంట్‌ ఇ–ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ incometax indiaefiling.govలో హోమ్‌ పేజీలో కనిపించే క్లిక్‌ లింక్స్‌ ఆప్షన్‌లో లింక్‌ ఆధార్‌ ను ఎంచుకోవాలి. ఇక్కడ సదరు వ్యక్తి పాన్‌ నెంబరు, ఆధార్‌ నెంబరు, ఆధార్‌ కార్డులో ఉన్న సదరు వ్యక్తి పేరును నమోదు చేసి స్రీన్‌పై కనిపించే  కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా లింక్‌ పూర్తవుతుంది. ఒక వేళ  కోడ్‌ కొట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు రిక్వెస్ట్‌ ఓటీపీ ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.  

ఎస్‌ఎంఎస్‌ ద్వారా..
వెబ్‌సైట్‌ ద్వారానే కాకుండా చేతిలో ఉన్న ఫోన్‌తో కూడా పాన్‌ కార్డుకు ఆధార్‌ను లింక్‌ చేయవచ్చు. ఇది కేవలం ఒక ఎస్‌ఎంఎస్‌ చేస్తే సరిపోతుంది. ఇందుకు   12  ఈఐఎఐఖీ  అఅఈఏఅఖN్ఖMఆఉఖ 10  ఈఐఎఐఖీ UIDPAN 12  DIGITS AADHAR NUMBER  10  DIGITS PAN NUMBER ఎంటర్‌ చేసి 567678 లేదా 56161 లకు ఎస్‌ఎంఎస్‌ చేస్తే సరిపోతుంది. 2019, మార్చి 31 లోపు కచ్చితంగా పాన్‌ కార్డులను ఆధార్‌ కు లింక్‌ చేసుకోవడానికి ఇచ్చే ఆఖరి గడువు. ఒక వేళ లింక్‌ చేసుకోక పోతే పాన్‌కార్డు డిలిట్‌ అవడమో లేదా పలు సందర్భాల్లో పాన్‌ కార్డులను అనుమతించక పోవడమో జరుగుతుంది. 

మరిన్ని వార్తలు