అంగన్‌వాడీ పోస్టుల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యం

5 Apr, 2018 10:09 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మహిళా, శిశు సంక్షేమ స్థాయీ సంఘ కమిటీ చైర్మన్‌ వరలక్ష్మి

అనుభవం కలిగిన వారికి, గతంలో పనిచేసిన ఉద్యోగులకు అవకాశం కల్పించాలి

ఏకగ్రీవంగా తీర్మానించిన మహిళా, శిశు సంక్షేమస్థాయీ సంఘ కమిటీ    

నల్లగొండ : అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ స్థాయీ సంఘ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి మహిళలకు న్యాయం చేయాలని సభ్యులు కోరారు. బుధవారం జెడ్పీ కా ర్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ స్థాయి కమిటీ, సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ సమావేశాలు కమి టీల చైర్మన్లు చింతల వరలక్ష్మీ, చుక్కా ప్రేమలత అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. కమిటీ సమావేశాల్లో సభ్యులు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ప్రకారం కాకుండా స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

గతంలో అంగన్‌వాడీ సెంటర్ల లో ఉద్యోగాలుగా పనిచేసి వేర్వేరు కారణాలతో మానేసిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానికులతో పాటు, ఇతర గ్రామాల్లో ఉంటున్న వారికి అవకాశం కల్పించాలని సభ్యుల అభిప్రాయం మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామాల్లో మహిళా సంఘాలను చైతన్యపర్చి వ్యక్తిగత మరుగుడొడ్లు నిర్మించుకునేలా కమిటీ సభ్యులు చొరవ చూపించాలని చైర్మన్‌ వర లక్ష్మీ, సీఈఓ హనుమానాయక్‌ సభ్యులకు సూచిం చా రు. అంగన్‌వాడీలకు విజయా డెయిరీ నుంచి పాలు సప్లయ్‌ కావడం లేదని, ఆ కాంట్రాక్ట్‌ను తొలగించి మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని  కోరారు.
కొత్త భవనాలకు ప్రతిపాదనలు 
సంక్షేమ వసతి గృహాలకు ఎక్కడైతే సొంత భవనాలు లేవో వాటిని గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే పక్కా భవనాల మంజూరుకు కృషి చేస్తానని కమిటీ చైర్మన్‌ చుక్కా ప్రేమలత పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్స్‌ పనుల త్వరగా పూర్తిచేయాలని, ఎస్సీ, ఎస్టీలకు రు ణాలు అందజేసి వారిని ఆదుకోవాలని చైర్మన్‌ సూ చించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు.

మరిన్ని వార్తలు