కరోనా పంజా.. పోలీస్‌@100

12 Jun, 2020 02:03 IST|Sakshi

నగర పోలీస్‌ విభాగాన్ని వణికిస్తోన్న వైరస్‌

వైరస్‌ బారినపడిన ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’లో పోలీసులే 49%

తాజాగా పదిమందికి పాజిటివ్‌.. వంద దాటిన కేసులు

‘క్లోరోక్విన్‌’ వినియోగంతో సిబ్బందికి కొత్త కష్టాలు

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసు విభాగాన్ని కరోనా వణికిస్తోంది. అధికారులు, సిబ్బంది వరుసగా దీని బారిన పడుతుండటం హడలెత్తిస్తోంది.  తాజాగా బంజారాహిల్స్‌ ఠాణాలో ఓ ఎస్‌ఐ సహా పది మంది పోలీసులు వైరస్‌ బారి నపడ్డారు. దీంతో బాధిత పోలీసుల సంఖ్య వంద దాటింది. మరికొందరి వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. నష్ట నివారణ కోసం ఉన్నతాధికారులు పోలీసులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) ఔషధాన్ని సరఫరా చేస్తున్నారు. దీని వినియోగం లేనిపోని రుగ్మతల్ని కలిగిస్తోందని పోలీసులు వాపోతున్నారు. కరోనాపై తొలి నుంచీ ముందుండి పోరాడిన పోలీ సులే ఇప్పుడు ఒక్కొక్కరుగా బాధితులవుతుం డటం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇక, పోలీ సుల తరువాత అత్యధికంగా వైద్యారోగ్య సి బ్బంది 79 మంది ఈ మహమ్మారి బారినపడ్డా రు. ఇతర శాఖల వారు ఏడుగురు ఉన్నారు. మొత్తానికి కరోనాపై ముందుండి పోరాడుతూ, వైరస్‌ బారినపడిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్లో ఒక్క పోలీస్‌ విభాగం నుంచే 49% మంది బాధితులుగా ఉన్నారు. ఈ మేరకు ప్ర భుత్వానికి వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది.

వరసపెట్టి చుట్టేస్తోంది..
కరోనా కట్టడికి, లాక్‌డౌన్‌ అమలుకు పోలీసులు రేయింబవళ్లు పనిచేశారు. అనుమానితులను పరీక్షలకు, పాజిటివ్‌ పేషెంట్లను ఆసుపత్రులకు తరలించడం, చికిత్స కేంద్రాలకు పహారా, కం టైన్మెంట్‌ జోన్లలో బందోబస్తు, వలస కూలీల తరలింపు, ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చినవారి గుర్తింపు.. ఇలా ప్రతీ పనిలో పోలీ సులు ముందున్నారు. నగర పోలీసు విభాగాని కి సంబంధించి తొలికేసు సైఫాబాద్‌ ఠాణాలో బయటపడింది. ఆ అధికారికి క్షేత్రస్థాయి కాం టాక్ట్‌ లేదని అధికారులు తేల్చారు. ఆపై వరుస గా వెలుగులోకి వచ్చిన కేసుల్లో అత్యధికం క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందే ఉన్నారు. గడిచిన కొన్ని రోజులుగా ఫీల్డ్‌ టచ్‌లేని, కార్యాలయాల్లో మాత్ర మే పనిచేసే వారికీ వైరస్‌ సోకుతోంది. ఠాణాలకు వచ్చి వెళ్లిన బాధితులు, అధికారులు,సిబ్బం ది నివసిస్తున్న ప్రాంతాలు, సహోద్యోగుల ప్రభావమే దీనికి కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

కుటుంబాలకు దూరంగా ఎందరో..
కోవిడ్‌ ఆసుపత్రిగా మారిన గాంధీ ఆసుపత్రికి పోలీసు విభాగం అదనపు భద్రత కల్పిస్తోంది. ఇటీవలి పరిణామాలతో డ్యూటీలో ఉన్న వారికి అదనంగా భారీగా సిబ్బంది, అధికారుల్ని పెం చారు. లాక్‌డౌన్‌ పర్యవేక్షణ, రాకపోకల క్రమబ ద్ధీకరణ, కర్ఫ్యూ అమలుకు నగరవ్యాప్తంగా 200 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పడ్డాయి. వీటిలో పగ లు, రాత్రి కనీసం పదిమంది చొప్పున పనిచేశారు. వీరిలో కొందరు ఇప్పటికే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వీరం తా కుటుంబాలకు దూరంగా ఉంటుండగా, ఇత ర అధికారులు, సిబ్బంది సైతం తమ కుటుం బాల శ్రేయస్సు దృష్ట్యా వారికి దూరంగా ఉంటున్నారు. కొందరు ఠాణాలకే పరిమితం కాగా, మరికొందరు చిన్నచిన్న గదులు అద్దెకు తీసుకు ని ఉంటున్నారు. కరోనా డ్యూటీలతో సంబంధం లేని విభాగాల్లో పనిచేస్తున్న వారిలోనూ పలువురు కుటుంబాలను స్వస్థలాలకు పంపి ఒంటరిగా నివసిస్తున్నారు.

క్లోరోక్విన్‌తో కొత్త రుగ్మతలు
నగర పోలీసు విభాగంలో కరోనా కేసులు పెరి గిపోతుండటంతో ఉన్నతాధికారులు నష్టనివార ణ చర్యలు చేపట్టారు. విభాగాల వారీగా అధికారులు, సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు లు సరఫరా చేస్తున్నారు. వీటి వినియోగంతో ఆరోగ్యంగా ఉన్న అధికారులు, సిబ్బంది కొన్ని రుగ్మతలకు లోనవుతున్నారు. లాక్‌డౌన్‌ అమల్లో కి వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో భా గంగా రోడ్లపైనే గడిపిన పోలీసులు.. అనేక మం ది లక్షణాలు బయటపడని ‘పాజిటివ్‌ వ్యక్తుల తో’ కాంటాక్ట్‌లోకి వెళ్లి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతోపాటు గాంధీ ఆసుపత్రి వద్ద విధులు నిర్వర్తించిన సిబ్బందితో పా టు కరోనా హాట్‌స్పాట్స్‌గా మారిన ప్రాంతాల్లో నివసించే, అక్కడ పనిచేసిన వారు, కంటైన్మెంట్‌ జోన్లలో డ్యూటీలకు హాజరైన వారికి ఈ ము ప్పు ఎక్కువగా ఉందని పోలీసు విభాగం గుర్తిం చింది.

దీంతో పోలీసు ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖను సంప్రదించారు. దీంతో ఆ శాఖ అ«ధికారులు పోలీసు సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరాకు అనుమతిచ్చారు. నగర పోలీసు విభాగంలో బేగంపేట పోలీసులైన్స్, పేట్లబురుజులోని సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్, అంబర్‌పేట పోలీసులైన్స్‌ ప్రాంగణాల్లో గల పోలీస్‌ క్లినిక్స్‌ ద్వారా సిబ్బందికి ఈ మందులు అందచేశారు. అయితే పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు లేకుండా నే వీటిని ఇవ్వాల్సి వచ్చింది. ఇది కొత్త ఇబ్బందులకు కారణమైంది. వీటిని వినియోగించిన వారిలో పలువురు లోబీపీ, డీహైడ్రేషన్, అలస ట తదితర అనారోగ్యాల బారినపడ్డారు. దీంతో దాదాపు సగం మంది ఈ మందులు తీసుకున్నా వాడటానికి «ధైర్యం చేయలేకపోయారు.

ఆందోళనలో పోలీసు కుటుంబాలు
పోలీసు విభాగంలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం, మరోపక్క హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు దుష్ఫ్రభావాలు చూపుతుండటం వెరసి పోలీస్‌ కుటుంబీకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రితో పాటు కంటైన్మెంట్‌ ఏరియాల్లో పనిచేసిన సిబ్బంది, అధికారులతో పాటు వారి కుటుంబీకులు ప్రస్తుత పరిణామాలతో హడలిపోతున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబీకుల్లో లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించడానికి గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటుచేశారు. అయితే ఆశించిన స్థాయిలో, వేగంగా పరీక్షలు జరగట్లేదని సిబ్బంది వాపోతున్నారు.

డీజీపీ ఆఫీసులో కరోనా కలకలం
పోలీసుశాఖలో కరోనా కలకలం ఆగడం లేదు. డీజీపీ ఆఫీసులో మరో ఉద్యోగి కరోనా బారినపడ్డారు. గురువారం మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సదరు ఉద్యోగిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు