నాలుగు జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు

24 May, 2016 06:22 IST|Sakshi
నాలుగు జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు

సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. సిద్ధంగా ఉన్న భవనాల్లో 20 పడకల ఆయుష్ ఆసుపత్రులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం మంత్రి లక్ష్మారెడ్డి ఆయుష్ వైద్య విభాగంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆయుష్ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఆయుష్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎయిడ్స్‌పై పరిశోధనలను మరింత ముమ్మరం చేసి ఆ మహమ్మారిని పారదోలాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆయుష్ కమిషనర్ డాక్టర్ రాజేందర్, డీఎంఈ రమణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ లలితకుమారి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు