కేటీఆర్ రోడ్ షో లో అపశృతి

22 Nov, 2018 20:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉప్పల్‌లో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ గురువారం నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన పాల్గొన్నారు. ఉప్పల్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

అయితే ఉప్పల్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తుండగా గ్యాస్ బెలూన్ పేలడంతో కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక జనాలు అయోమయంలో పడిపోయారు. అయితే గాయ పడిన వారందరినీ స్థానిక శివ సాయి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితులు ప్రస్తుతం కోలుకుంటున్నారు.

మరిన్ని వార్తలు