వెదురు వస్తువులు అదిరే

9 Feb, 2020 10:04 IST|Sakshi
వెదరుతో చేసిన నెమలి

ఎదులాపురం: కర్ర.. ప్లాస్టిక్‌.. ఇనుము.. ఇతరాత్రలో చేసిన గృహోపకరణాలు, వస్తు సా మగ్రిని చూసి ఉంటాం.. కాని వెదురు బొంగుతో తయారు చేసిన పలు వస్తు సామగ్రి సైతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్థానిక చేతివృత్తి కళాకారులు వెదురుతో ని త్యం ఇంట్లో ఉపయోగించే పలు రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నాయి. 

అంకురార్పణ.. ఆలోచన..
పట్టణానికి చెందిన జి.కిరణ్‌ వెదురుతో గృహోపకరణాలు తయారు చేస్తున్నాడు. పట్టణంలోని రైతు మార్కెట్‌లో షాపు ఏర్పాటు చేసుకొని విక్రయిస్తున్నాడు. మొదట్లో జొన్నకర్రను వినియోగించి చిన్న చిన్న గృహోపకరణాలు తయారు చేసే వాడు. వెదురుతో చేయాలనే ఆలోచన  రాగా, అందుబాటులో ఉండే వెదురుతో చిన్న చిన్న వస్తు సామగ్రి తయారు చేయడం మొదలు పెట్టాడు. అస్సాంకు చెందిన వెదురును హైదరాబాద్‌ నుంచి తెప్పించుకుని గృహోపకరణాలు తయారు చేస్తున్నాడు. త్రిపుర, అగర్తలా, కేరళ, పుణే, నాగ్‌పూర్, రాజమండ్రి, విజయవాడ, వరంగల్‌ స్వయం సహాయ సంఘాల కు వీటి తయారీపై శిక్షణ ఇస్తున్నాడు.

వస్తు సామగ్రి, గృహోపకరణాలు..
టేబుల్‌ ల్యాంప్‌ సెట్‌ రూ. 3, 500, వాల్‌ ల్యాంప్‌ సెట్‌ రూ. 500 నుంచి 600,  ప్లవర్‌ బోకేలు రూ. 500 నుంచి 700,  వాటర్‌ బాలిల్‌ లీటరుది రూ.350, అర లీటరుది రూ.250, టీ కప్పులు ఒక్కోటి రూ.50 నుంచి 60, ట్రే రూ. 350, త్రిపుల్‌ యాంగిల్‌ లెటర్‌ బాక్స్‌లు రూ.300, మేల్, ఫీమేల్‌ పికాక్స్‌ రూ.1500, డస్టిబిన్‌ రూ.350, సింగల్‌ చేయిర్‌ రూ.1200, సోఫాసెట్‌ రూ.20 వేలు, గాజుల స్టాంట్‌ రూ.150, దుర్గామాత విగ్రహం రూ. 10 వేలుగా విక్రయిస్తున్నాడు. 

రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి
వెదురుతో చేసిన దుర్గామాత కళాఖండాన్ని గోల్కొండలో ఏర్పాటు చేసిన చేతి వృత్తుల కళాఖండాల ప్రదర్శనలో ప్రదర్శనకు ఉంచాం.  ఇందుకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి అందుకున్నాం.   జి.కిరణ్, శాంతినగర్, ఆదిలాబాద్‌

తయారు చేస్తున్న మహిళలు

దుర్గామాత

నౌక కళాఖండం
​​​​​​​

మరిన్ని వార్తలు