టికెట్‌ ఇవ్వలేదని పార్టీ మారను

23 Mar, 2019 03:47 IST|Sakshi

బీజేపీ నేత బండారు దత్తాత్రేయ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ టికెట్‌ ఇవ్వలేదని పార్టీ మారే వ్యక్తిని కానని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, ఈ విషయంలో తనకు పూర్తి సంతృప్తి ఉందన్నారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం 1980లో మొదలైందని, తానెప్పుడూ టికెట్‌ ఇవ్వమని అధిష్టానాన్ని కోరలేదని చెప్పారు. శుక్రవారం ఓ ప్రైవేట్‌ హోటల్లో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్‌రెడ్డికి తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ స్థానంలో బీజేపీని గెలిపిస్తామన్నారు.  

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెబుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లను గెలుస్తుందనుకోవడం ఓ భ్రమేనని దత్తాత్రేయ వ్యాఖ్యా నించారు. తమది జాతీయ పార్టీ అని.. టీఆర్‌ఎస్‌ది ప్రాంతీయ పార్టీ మాత్ర మే అన్న విషయాన్ని గ్రహించాలన్నారు. కేసీఆర్‌కు ఒక స్పష్టమైన ఆలోచన విధానం లేదని, అయోధ్యలో రామమందిరం గురించి స్పష్టంగా మాట్లా డేది బీజేపీ మాత్రమేనన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సునీతా లక్ష్మారెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించామన్నారు. వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి వస్తారే కానీ.. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లబోరని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు