ఆలయ తలుపుల్ని పగలగోట్టిన ఎలుగుబంటి

28 Jul, 2018 13:35 IST|Sakshi
కట్కూర్‌లో సంచరిస్తున్న ఎలుగుబంటి

బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండ లం కట్కూర్‌ గ్రామంలో గురువారం రాత్రి ఎలుగుబంటి సంచరిండం గ్రామస్తులను కలవరపెట్టింది. అర్ధరాత్రి గ్రామంలో ఎలుగుబంటిని చూ సి కుక్కలు అరవగా గ్రామస్తులు దానికి గమనించి భయంతో తలుపులు వేసుకున్నారు. గ్రామ నడిబొడ్డునఉన్న హనుమాన్‌ ఆలయం తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లింది.

అదే సమయంలో అటు గా వెళ్తున్న కొందరు ఎలుగుబంటిని చూసి అం దరికీ ఫోన్లో సమాచారం అందించారు. కాగా కుక్క లు తరమడంతో ఎలుగుబంటి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయి ంది. కాగా ఎలు గుబంటు భయంతో పాలవ్యాపారులు వ్యవసాయ కూలీలు, రైతులు ఒంటరిగా బయటకు రాలేదు.

రాత్రి వేళ గ్రామం లోని జీపీ కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఎలుగుబంటి దృశ్యాలు న మోదయ్యాయి. సంబంధిత అధికారులు ఎలుగుబంటిని పట్టుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు