హైకోర్టు ప్రాంగణంలో గబ్బిలాలు

29 May, 2018 01:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ప్రాంగణంలో పెద్ద సంఖ్య లో గబ్బిలాలున్నాయని.. వీటితో కోర్టుకు వచ్చే వారికి నిపా వైరస్‌ సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు సోమవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ను కోరారు. న్యాయవాదుల తరఫున ఎన్‌.కృష్ణకుమార్‌గౌడ్‌ రిజిస్ట్రార్‌కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

హైకోర్టులో వందల సంఖ్యలో గబ్బిలాలున్నాయని, ప్రతీరోజూ న్యాయమూర్తులు, న్యాయవాదులతోపాటు కక్షిదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, కాబట్టి నిపా వైరస్‌ సోకకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముం దన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్లు, జ్యూస్‌ స్టాళ్ల వద్ద శుభ్రత పాటించేలా చూడాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తుంటారని, ఆ చెట్ల మీదనే గబ్బిలాలు ఉంటున్నాయని, కాబట్టి ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు