కేంద్రంలో మళ్లీ మేమే!

3 Apr, 2017 03:29 IST|Sakshi
కేంద్రంలో మళ్లీ మేమే!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే
ముగిసిన పార్టీ శిక్షణా తరగతులు


సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రజలంతా ప్రధాని మోదీ నాయకత్వానికి పూర్తి మద్దతు పలుకు తున్నారని, 2019లో జరిగే పార్లమెంటు ఎన్నిక ల్లోనూ బీజేపీ అధికారం దక్కించుకోవడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజిగూడలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆకాం క్షను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు.

 ఉద్యమంలో పనిచేసిన నాయకులు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజ లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, వచ్చే ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమన్నారు. సబ్బం డ వర్గాలు ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలం గాణలో విపక్షాల గొంతు నొక్కడమే కాకుండా ప్రజాసంఘాలను వేధిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్య వహరిస్తోంద న్నారు. ధర్నా చౌక్‌ను సైతం ఎత్తివేస్తూ సామాన్యుల హక్కులను కాలరా స్తోందన్నారు.

 టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక మర్చిపో యిందని, అప్రజా స్వామికంగా వ్యవహరిస్తోందని దుయ్యబ ట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కుంచించు కుపోయిందని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నా రు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.
 
కమ్యూనిజానికి కాలం చెల్లింది..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు మాట్లాడుతూ.. కమ్యూనిజానికి కాలం చెల్లిందని, కులాల పంచాయతీని యూనివర్సి టీల్లోకి తేవడం దారుణమని అన్నారు. కామ్రే డ్లు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం కాదని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.

 బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సుపరిపాలన, అవినీతిరహిత పాలన మోదీ ద్వారానే సాధ్యమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాగం జనార్దన్‌ రెడ్డి, మంత్రి శ్రీనివాస్, పేరాల శేఖర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, గుండ్ల బాలరాజు, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన సుమారు 300 మంది నాయకులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ దళిత వాడలకు అమిత్‌షా
కేంద్రం దళితుల అభివృద్ధి, వారి అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్ర మాలను వివరించేందుకు ఈ నెల 6–14 తేదీల మధ్య సామాజిక సమరసత కార్యక్ర మాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టనుంది. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవమైన ఈ నెల 6 నుంచి అంబేడ్కర్‌ జయంతి రోజైన 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 7వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌ రాను న్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని దళితవాడల్లో ఆయన ఆ రోజంతా గడపను న్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

బూత్‌ కమిటీలను వెంటనే నియమించండి
రాష్ట్రంలో వీలైనంత త్వరగా మండల, పోలింగ్‌ బూత్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులను ఆదేశించింది. బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారానే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలోపేతం కాగలదని సూచించింది. ఆదేశించారు. రాష్ట్రస్థాయి పార్టీ శిక్షణ శిబిరంలో అధిష్టానం దూత, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సావధాన్‌సింగ్‌ ఈ మేరకు నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు