‘పీవోకేను కలుపుకున్నాకే కశ్మీర్‌లో ఎన్నికలు’

28 Sep, 2019 20:30 IST|Sakshi
మాట్లాడుతున్న రఘునందన్‌రావు

సాక్షి, ఆదిలాబాద్‌ : గత 70 ఏళ్లు భారత దేశ చరిత్ర వక్రీకరణకు గరవుతోందనీ, కుహానా మేధావులు ఎందరో దీనికి కారణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు విమర్శించారు. శనివారం ఆదిలాబాద్‌లో టీఎన్జీవో భవన్‌లో నిర్వహించిన ఆర్టికల్‌ 370 రద్దుపై చర్చాగోష్టి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. ఆంగ్లేయుల కుటిల పన్నాగంతోనే భారతదేశం విభజనకు గరైందన్నారు. రాజా హరిసింగ్‌ పాలనలో ఉన్న కశ్మీర్‌ భూభాగాన్ని ఆక్రమించుకునే దుశ్చర్యకు పాక్‌ పాల్పడిందన్నారు. నాటి నెహ్రూ ప్రభుత్వం షేక్‌ అబ్దుల్లాకు అనుకూలంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. అబ్దుల్లాను అంబేద్కర్‌ వద్దకు పంపించి ఆర్టికల్‌ 370 ని రాజ్యాంగంలో చొప్పించే ప్రయత్నం చేయగా, అంబేద్కర్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని తెలియజేశారు. దాంతో రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులైన గోపాలకృష్ణ అయ్యంగార్‌ ద్వారా వాళ్లు అనుకున్నది సాధించారని పేర్కొన్నారు. అయితే 370ని రద్దుచేసే అంశం కూడా అదే క్లాజ్‌లో ఉందని, దాని ద్వారానే నేడు రద్దు సాధ్యమైందని వివరించారు.

స్థానిక ప్రజల కోరిక మేరకే లడాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశారన్నది గుర్తుంచుకోవాలన్నారు. అన్ని వర్గాల మేలుకోసం కశ్మీర్‌లో రిజర్వేషన్ల సవరణ, సమానత్వమే జనసంఘ్‌, బీజేపీల ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో తదుపరి ఎన్నికలు పీవోకేను కలుపుకునే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. 370 రద్దుతో ప్రజల్లో హర్షం, కాంగ్రెస్‌లో అసహనం మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి కానీ మోదీ ప్రధాని అయ్యాక అవి మచ్చుకైనా కానరావట్లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే  370 ఆర్టికల్‌ రద్దుపై తనకు ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దుతోనే ముస్లిం మహిళలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, పార్టీ పార్లమెంట్ కన్వీనర్ ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

'హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేసిన కాంగ్రెస్‌ను గెల్పించండి'

‘అబద్దం చెప్పి.. ఉత్తమ్‌ ఎంపీగా గెలిచారు’

ఇస్తే రెండు చీరలివ్వండి.. లేకపోతే వద్దు !

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు

బయటపడ్డ ఆడియో టేపులు

శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

బతుకమ్మ ఉత్సవాలు

కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

బ్రైడ్‌ లుక్‌... ఫిల్మీ స్టైల్‌

సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్‌ బకాయిలు

ఆపద్బంధులా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌

పండిద్దాం.. తినేద్దాం..

ధరల దూకుడు.. ఆగేదెప్పుడు!

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో నభా నటేష్‌

సీపేజీ కాదు.. లీకేజీనే..

ముదురుతున్న గ్రానైట్‌ యుద్ధం

కేసులపై ఇంత నిర్లక్ష్యమా..?!

నగరం నిద్రపోతున్నవేళ 'నీటిలో సిటీ'

ఖానాపూర్‌లో కోర్టు కొట్లాట!

ఫలితమివ్వని ‘స్టడీ’

నిరుపయోగంగా మోడల్‌ హౌస్‌

వామ్మో.. పులి

స్వచ్ఛ సిద్దిపేటవైపు అడుగులు

తెలంగాణలో 2,939 పోస్టుల భర్తీకి ప్రకటన

బతుకునిచ్చే పూలదేవత

ఆయకట్టుకు గడ్డుకాలం

సీనియారిటీ కాదు..సిన్సియారిటీ ముఖ్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

అమితాబ్‌ చెప్పినా చిరు వినలేదట

మరోసారి పెళ్లి చేసుకుంటున్న బీబర్‌!

ఎలిమినేట్‌ అయింది అతడే!

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌