ఘనంగా అమ్మవారి బోనాలు

19 Jun, 2018 01:12 IST|Sakshi
బంగారు బోనం నమూనాను ఆవిష్కరిస్తున్న మంత్రులు పద్మారావు, తలసాని తదితరులు

ప్రభుత్వం తరఫున బంగారంతో బోనం: మంత్రి తలసాని 

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 15 నుండి ఘటం ఎదుర్కోలుతో ప్రారంభమవుతాయని, జూలై 29న అమ్మవారికి బోనాలు, 30న రంగం (భవిష్యవాణి) కార్యక్రమాలు ఉంటాయని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించేం దుకు పెద్దఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు గౌడ్‌తో కలసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో బోనాల జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బంగారు బోనం నమూనాను మం త్రులు ఆవిష్కరించారు.

మంత్రి మాట్లాడుతూ ప్రభు త్వం తరుఫున కోటి రూపాయలతో 3 కిలోల 80 గ్రాముల బంగారంతో బోనం తయారు చేయిస్తున్నా మన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనా లను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఆలయ పరిసరాలలో పారిశు«ధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని, బారికేడ్‌లను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తులకు తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు విధులు నిర్వహిస్తారని అన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున దానిని దృష్టిలో ఉంచు కొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయం ఆవరణలో 24 లక్షల రూపా యల ఖర్చుతో భారీషెడ్డును నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో కలెక్టర్‌ యోగితా రాణా, వాటర్‌వర్క్స్‌ ఎండీ దానకిషోర్, దేవాదాయ శాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ శ్రీనివాస్, కల్చరల్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, మహంకాళి ఆలయ ఈవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు