నాడు నాన్న.. నేడు అమ్మ

11 Dec, 2019 11:05 IST|Sakshi
తల్లి విఠ్ఠమ్మ మృతదేహం వద్ద నవీన్‌

అనాథగా మారిన బాలుడు

గ్రామస్తుల చందాలతో తల్లి అంత్యక్రియలు

సాక్షి,  కల్హేర్‌(నారాయణఖేడ్‌): నాడు నాన్న చనిపోయాడు.. నేడు అనారోగ్యంతో తల్లడిల్లుతున్న తల్లి మరణించడంతో వారి కొడుకు నవీన్‌(17) అనాథగా మారాడు. మంగళవారం కల్హేర్‌ మండలం మార్డిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరుడి సాయిలు, నీరుడి విఠ్ఠమ్మ దంపతులకు.. ఇద్దరు సంతానం. కూతురు చిట్టమ్మ, కుమారుడు నవీన్‌ ఉన్నారు. సాయిలు 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు.  కూతురు చిట్టమ్మ వివాహం ఇటీవలే నారాయణఖేడ్‌ మండలం కొత్తపల్లికి చెందిన ఓ వ్యక్తితో జరిగింది.

పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భర్తతో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి చిట్టమ్మ పుట్టింట తల్లి విఠ్ఠమ్మ వద్ద ఉండేది. చిట్టమ్మ రెండు నెలల క్రితం పురిటి నొప్పులు తాళలేక మృతి చెందింది. దీంతో ఇంట్లో తల్లి నీరుడి విఠ్ఠమ్మ(45)కు కుమారుడు నవీన్‌ ఒక్కడే తోడుగా మిగిలాడు. అనారోగ్యంతోపాటు మానసిక క్షోభతో విఠ్ఠమ్మ మంగళవారం మృతిచెందింది. దీంతో నవీన్‌ అనాథగా మిగిలాడు. తల్లి అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో పడిపోయాడు. విఠ్ఠమ్మ దూరం కావడంతో గ్రామస్తులు చలించిపోయారు. వారు చందాలు వేసి విఠ్ఠమ్మ అంత్యక్రియల కోసం రూ. 11,500 నగదు సహాయం అందజేశారు. తల్లి విఠ్ఠమ్మ మృతదేహం వద్ద నవీన్‌ 

మరిన్ని వార్తలు